గానా ఆఫ్ రిపబ్లిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్
‘రిపబ్లిక్’ సినిమా సాయితేజ్‌కు గ్రేట్ సక్సెస్ కావాలి: ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ ఈవెంట్లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. శనివారం ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ‘రిపబ్లిక్’ సినిమాలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయితేజ్, డైరెక్టర్ దేవ్ కట్టా, నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ఎం.సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కో డైరెక్టర్ కిరణ్, రైటర్ బి.వి.ఎస్.రవి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా…
నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్ సాంగ్ కొరటాల శివగారి చేతుల మీదుగా స్టార్ట్ కావడమే పెద్ద సక్సెస్‌గా మేం భావిస్తున్నాం.
డైరెక్టర్ దేవ్ కట్టా మాట్లాడుతూ “నేను మణిశర్మగారితో చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుదామని అనుకుంటున్న సమయంలో ‘రిపబ్లిక్’ సినిమాకు కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి కొరటాల శివగారి కంటే బెటర్ పర్సెన్ మరొకరు ఉండరనిపించింది. ఆయన మా సాంగ్‌ను రిలీజ్ చేయడం చాలా సంతోషం. అలాగే రైటర్ బి.వి.ఎస్.రవిగారికి థాంక్స్. జీ స్టూడియోస్వారు స్టార్టింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. డైరెక్టర్‌గా నాకు ఎంతో స్పేస్ ఇచ్చారు. అందువల్ల నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చక్కగా ప్రెజెంట్ చేయగలుగుతున్నాను. వారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నాను. లిరిక్ రైటర్ రెహమాన్ మంచి సాహిత్యాన్ని అందించాడు. అలాగే సాయితేజ్‌కి, నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. ఎంతో సపోర్ట్ చేశారు” అన్నారు.
రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ “‘రిపబ్లిక్’ అనే టైటిల్లోనే చాలా సామాజిక బాధ్యత కనిపిస్తుంది. ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ కట్ గమనిస్తే సినిమాలో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉండబోతుందని అర్థమవుతుంది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్యలాగానే ఈ సినిమాను కూడా దేవ్కట్టాగారు తన స్టైల్లో తెరకెక్కించారని అనుకుంటున్నాను. సాయితేజ్ ఎలాంటి క్యారెక్టర్‌ను అయినా చేయగల నటుడు. ఈ సినిమాలోనూ చాలా మంచి పాత్రలో కనిపిస్తాడు. మణిశర్మగారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్‌ను ఎంతో ట్రెండీగా అందించారు. నిర్మాతలు భగవాన్, పుల్లారావుగారు సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాట్లాడుతూ “సాయితేజ్‌తో తొలిసారి కలిసి పనిచేస్తున్నాను. అలాగే నిర్మాతలు భగవాన్, పుల్లారావుగారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దేవ్ కట్టాగారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అన్నారు.
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ “గానా ఆఫ్ రిపబ్లిక్’ సాంగ్‌ను పెద్ద స్క్రీన్‌పై చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం. దేవ్ కట్టాగారు నాకు ఒక మంచి సినిమాను ఇచ్చారు. మా నిర్మాతలు భగవాన్‌గారు, పుల్లారావుగారు, జీస్టూడియోస్వారు కలిసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మణిశర్మగారితో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇకపై ఆయనతో చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. కొరటాల శివగారు స్పెషల్ గెస్ట్‌గా వచ్చి ఆశీర్వదించినందుకు ఆయనకు థాంక్స్” అన్నారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ “‘రిపబ్లిక్’లో సాంగ్ రిలీజ్ చేయడాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్వేచ్చ గురించి చెప్పే సాంగ్ చాలా బావుంది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. నిర్మాతలు భగవాన్, పుల్లారావుగారు మిర్చి సినిమా నుంచి పరిచయం. చాలా సౌమ్యులు. ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్. వారికీ సినిమా చాలా పెద్ద సినిమా కావాలి. దేవ్ కట్టాగారి గురించి చెప్పాలంటే ఆయన ప్రస్థానం సినిమా నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఓ విషయాన్ని ఎంత బలంగా నమ్ముతారో, అంతే బలంగా చెబుతారు. ఇన్టెన్స్ ఫిల్మ్ మేకర్. సింపుల్ ఎక్స్ప్రెషన్ను కూడా ఇన్టెన్స్తో చెబుతారు. అందరినీ ఆలోచింపచేసే పాయింట్‌ను ఈ సినిమాలో చెబుతారని ఆశిస్తున్నాను. మణిశర్మగారితో పనిచేయడం ఆలస్యమైనా ఇప్పుడు కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఆయన్ని అందరూ మెలోడి బ్రహ్మ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడర్థమైంది. సాయితేజ్ నాకు బ్రదర్‌లాంటోడు. తనతో చిన్న ఎమోషనల్ కనెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. తనకు సక్సెస్ వస్తే నాకు సక్సెస్ వచ్చినట్లు ఫీల్ అవుతాను. తను చేసే సినిమాలన్నీ సక్సెస్‌లు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటీనటులు:
సాయితేజ్
ఐశ్వర్యా రాజేశ్
జగపతిబాబు
రమ్యకృష్ణ
సుబ్బరాజు
రాహుల్ రామకృష్ణ
బాక్సర్ దిన
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్
కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా
స్క్రీన్‌ప్లే: దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్