గ‌ల్లీ రౌడీ మూవీ సాంగ్‌ విడుద‌ల

Published On: July 23, 2021   |   Posted By:
 
 
గ‌ల్లీ రౌడీ మూవీ సాంగ్‌ విడుద‌ల
 
 
 
`గ‌ల్లీ రౌడీ` నుంచి `చాంగురే చాంగురే..` అనే సాంగ్‌ను విడుద‌ల చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌
 
“చాంగురే చాంగురే ఐటెం సాంగురే పాడుకుంటే రాతిరంత రాదు నిద్ద‌రే
ఎప్పుడంటే అప్పుడే ఎక్క‌డంటే అక్క‌డే న‌న్ను చూస్తే ఎవ్వ‌డైనా పూల‌రంగ‌డే
అబ్బ‌బ్బా ఇంతందంతో ఎట్టా స‌చ్చేది.. అబ్బ‌బ్బా మీ కుర్రాళ్ల‌ని ఎట్టా ఆపేది
ధ‌వ‌ళేశ్వ‌రం ఆన‌క‌ట్ట తెంచిన‌ట్లు నాపై జ‌నం దూకుతుంటారే …“
 
అంటూ కుర్ర కారును రెచ్చ‌గొట్టేస్తూ హోయ‌లు పోతుంది బ్యూటీ స్నేహ గుప్తా.ఆమె అంత‌లా కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేప‌డానికి గ‌ల కార‌ణం మాత్రం `గ‌ల్లీరౌడీ` సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. 
 
యంగ్ అండ్ ఎనర్జిటి స్టార్ సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `గ‌ల్లీరౌడీ`. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి గురువారం ఈ సినిమా నుంచి  `చాంగురే చాంగురే…` అనే ఐటెమ్ సాంగ్‌ను హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేసి సినిమా మంచి స‌క్సెస్‌ను సాధించాల‌ని యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. పాట విష‌యానికి వ‌స్తే…ఇందులో సందీప్‌కిష‌న్‌, స్నేహ‌గుప్తా ఎన‌ర్జిటిక్ ఫెర్ఫామెన్స్‌ను చూడొచ్చు. వీరితో పాటు పోసాని కృష్ణ‌ముర‌ళి, వైవా హ‌ర్ష త‌దిత‌రులు ఈ పాట‌లో క‌నిపించారు. భాస్క‌రభ‌ట్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు. ప్రేమ్ ర‌క్షిత్ కొరియోగ్ర‌ఫీ చేశారు. సింగ‌ర్‌ మంగ్లీ త‌న‌దైన స్టైల్లో పాట పాడి పాట‌కు మంచి  హుషారునిచ్చింది. 
 
బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 
 
న‌టీన‌టులు: సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు
 
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
స‌హ నిర్మాత‌:  జి.వి
సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌
క‌థ‌: భాను
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌