చావు కబురు చల్లగా మూవీ రివ్యూ

Published On: March 19, 2021   |   Posted By:

చావు కబురు చల్లగా మూవీ రివ్యూ

చావు కబురే..: ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

Rating: 2 / 5

తెలుగు సినిమా మారుతోంది. విభిన్నతకు పెద్ద పీట వెయ్యకపోతే ఎవరూ కేర్ చెయ్యటం లేదు. ఆ విషయం కొత్తగా వస్తున్న యంగ్ హీరోలు, డైరక్టర్స్ గమనిస్తున్నారు. అందుకు తగ్గట్లే తమను తాము మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ లో కొందరే సక్సెస్ అవుతున్నారు. మిగతావాళ్లు కొత్తదనం పేరిట చెత్తదనం పోగేస్తున్నారు. ఓ విభిన్నమైన టైటిల్, ట్రైలర్ తో ఈ సినిమా కూడా జనాల్లో ఏదో కొత్తదనం చూడబోతున్నామనే ఆశ రేపింది. అయితే ఆ కొత్తదనం ఏ మేరకు ఉంది..అసలు ఈ చిత్రం కథేంటి, ఆర్ ఎక్స్ 100 తర్వాత హిట్ లేని కార్తికేయ ఈ సినిమాతో అయినా తిరిగి ఫామ్ లోకి వచ్చాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

శవాలను మోసుకెళ్లే మార్చురీ వ్యాన్ డ్రైవర్ బాలరాజు(కార్తికేయ)ది ఓ డిఫరెంట్ ఫిలాసపి. ఎవరైనా చివరకు అక్కడకి చేరాల్సిందే కదా..జర్నీ ముగిసే లోపల ఎంజాయ్ చేయాలి..జీవితాన్ని అనుభవించాలి అని. అలాంటి బాలరాజు ఓ రోజు ఓ శవాన్ని శ్మసాన వాటికకు తీసుకెళ్తటానికి పిలుపు వస్తే వెళ్తాడు. అక్కడ మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూస్తాడు. ఆమె భర్తే చనిపోవటంతో ఆమె చాలా బాధలో ఉంటుంది. ఆమె ను చూసిన బాలరాజు వెంటనే ప్రేమలో పడిపోతాడు. అక్కడ నుంచి ఆమె వెంటపడతాడు. అందరూ ఛీ కొట్టినా వదలడు. పోలీస్ లు వచ్చిన వార్నింగ్ లు ఇచ్చినా కదలడు. ఈ లోగా అతనికి తల్లి గంగమ్మ(ఆమని)కు చెందిన ఓ అక్రమ సంభందం గురించి తెలుస్తుంది. అప్పుడు అతనో డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ అతని వన్ సైడ్ లవ్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంతకీ బాలరాజు తల్లి విషయంలో తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి…చివరకు అతని ప్రేమ కథ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

ఈ సినిమాకు క్యారక్టర్స్ అనుకుని ఎగ్జైట్ అయ్యి..సీన్స్,స్క్రీన్ ప్లే డవలప్ చేసినట్లున్నారు. ఆ పాత్రల్లో నుంచి వచ్చే కథలా కాకుండా ఒక అబ్బాయి..అమ్మాయి లవ్ స్టోరీలా దీన్ని మలిచారు. దాంతో ఆ క్యారక్టరైజేషన్స్ తప్పితే అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే మనకు హీరోయిన్ మల్లిక పాత్ర …తన భర్తతో ఎలాంటి రిలేషన్ లో ఉందో తెలియదు. అతను చనిపోయినా ఆ జ్ఞాపకాల్లో బ్రతికే స్దాయిలో ఉందా లేక అతనితో విసిగిపోయిందా అదేమీ మనకు తెలియదు. ఆ గాఢత తెలియందే ఈ కథని ఎలా అర్దం చేసుకుంటాం. హీరోయిన్ కాబట్టి ఆ సీన్స్ పెడితే బాగుండదు అని ఎవాయిడ్ చేసినట్లున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ కన్నా సబ్ ప్లాట్ ని బాగా డీల్ చేసారనిపిస్తుంది. సబ్ ప్లాట్ తల్లి ఆమని పాత్రది. ఆమె చిన్నవయస్సులో పెళ్లై..నాలుగేళ్లకే భర్త మంచం పడితే..వేరే వారితో అక్రమ సంభందం పెట్టుకుంటుంది. అది బూతుగా అనిపించకుండా మెచ్యూరిటిగా డీల్ చేసారు. తల్లి అక్రమ సంభందాన్ని కొడుకు ఏక్సెప్టు చేయటం కొంచెం వింతగా ఉన్నా ఆశ్చర్యం అనిపించదు. అర్దం చేసుకున్నట్లు ఉంటుంది. అయితే మెయిన్ ప్లాట్ లో సమస్యలను అలాగే ఉంచేసినప్పుడు సినిమా ఏమి చూడాలి అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని డ్రమటిక్ ఎమోషనల్ ఎలిమెంట్స్ క్లైమాక్స్ లో  ఉన్నా, అక్కడ దాకామనం సినిమాని ఓపిగ్గా భరించాలి.
  
డైరక్షన్,మిగతా విభాగాలు..

స్క్రిప్టు సరిగ్గా చేసుకోలేనప్పుడు సినిమా ఎంత బాగా తీసినా ఉపయోగం ఏముంటుంది. సరైన కెమెరా మెన్ ఉంటే ప్రతీ ఫ్రేమ్ ఈ రోజు అద్బుతంగా చెక్కేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. బిజోయ్ సంగీతం అద్బుతం కాదు కానీ బాగుంది.  ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదను పెట్టాలి.  ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే స్లో గా అనిపించదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక  కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని సినిమాకు పిల్లర్స్ గా నిలిచారు. కార్తికేయ దాదాపు ఒంటిచేత్తో మోసుకెళ్లినట్లుగా సినిమాని లాగాడు. ఆమని అయితే అదరకొట్టింది.

చూడచ్చా

ఏ ఎక్సపెక్టేషన్స్ లేకుండా వెళితే…ఓకే అనిపిస్తుంది.

 తెర ముందు..వెనక

బ్యానర్:  గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి,  మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు
ఎడిటర్ : సత్య . జి
సినిమాటోగ్రాఫర్:  కరమ్ చావ్లా
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్ : జి యమ్ శేఖర్
ప్రొడక్షన్ డిసైనర్ : మనీషా ఏ దత్
కాస్ట్యూమ్ డిసైనర్: మౌన గుమ్మడి
అడిషనల్ డైలాగ్స్ : శివ కుమార్ బొజ్జుల
ఆడియో : ఆదిత్య మ్యూజిక్
పబ్లిసిటీ డిజైనర్ : అనిల్ అండ్ భాను
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,మేఘ శ్యామ్
సమర్పణ : అల్లు అరవింద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శరత్ చంద్ర నాయుడు ,రాఘవ కరుతూరి
రన్ టైమ్ : 2గం 17 ని
రచన, దర్శకత్వం : కౌశిక్ పెగళ్ళపాటి
నిర్మాత :బన్ని వాస్
రిలీజ్ డేట్:  19 మార్చి 2021