Reading Time: 2 mins

చిత్తం మహారాణి సినిమాకి విశేష స్పందన

ఇటీవల కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఒక మంచి సినిమా ఏ ఓటిటి ప్లాట్ఫ్రామ్ లో ఉన్న, ఏ భాషల్లో ఉన్న వాటికి సరైన ఆదరణ లభిస్తుంది. ఇంకా ప్రేక్షకులుకు ఒక గొప్ప సినిమాను అందించడానికి ఆహా లాంటి ప్లాట్ఫ్రామ్ కూడా ఉండటం విశేషం. వేరే భాషలో హిట్ అయినా సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా ప్లాట్ఫ్రామ్ లో కూడా కొన్ని అప్పుడప్పుడు అరుదైన అందమైన చిత్రాలు వస్తుంటాయి. అచ్చం అలాంటి చిత్రమే సుకుమార్ శిష్యుడు ఆకుల కాశీ విశ్వనాధ్ తెరకెక్కించిన చిత్తం మహారాణి.

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కి మంచి స్పందనే లభించింది. ఈ సినిమా టీజర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా విడుదల చేసి ప్రమోట్ చేశారు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లోతెరకెక్కిన ఈ సినిమాలో యజుర్వేద్ గుర్రం, రచన ఇందర్ హీరోహీరోయిన్లుగా నటించారు.  చిత్తం మహారాణి  కి ఇప్పుడు అద్భుతమైన స్పందన లభిస్తుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే చైత్ర (రచన ఇందర్) బీటెక్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్తుంది.అయితే ఇంటికి తిరిగి వెళ్దామనుకునే టైంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారు. దీంతో తన ఫ్రెండ్ ఇచ్చిన సలాహాతో ఒక యాప్ ద్వారా రచన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఆ యాప్ ద్వారా రచనను ఇంటికి తీసుకెళ్లేందుకు రాజు (యజుర్వేద్ గుర్రం) వస్తాడు. అసలు రాజుకు రచనకు ఉన్న సంబంధం ఏంటీ? సొంత ఊరుకు వెళ్లేందుకు రాజు, రచన ఎలాంటి కష్టాలు పడ్డారు? అనేది ఈ సినిమా కథ.

సుకుమార్ రైటింగ్స్ లో ఇప్పటివరకు సుకుమార్ కథలతో ఆయన శిష్యులు దర్శకులుగా మారారు. సుకుమార్ తో ఆర్య సినిమా నుంచి అసోసియేట్ అయిన శిష్యులలో ఒకరైన కాశీ విశ్వనాధ్ ఈ సినిమాను అందంగా మలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాపై దర్శకుడు బుచ్చిబాబు సాన, సుధీర్ వర్మ లాంటి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నటీనటులు:

యజుర్వేద్ గుర్రం, రచన ఇందర్, తులసి, సునీల్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, మధునందన్.

సాంకేతికవర్గం :

సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ. కాశీ
సంగీతం: గౌర హరి
మాటలు: సురేష్ సిద్ధాని
నిర్మాతలు: జేఎస్ మణికంఠ, టీఆర్. ప్రసాద్ రెడ్డి
సమర్పణ: లిటిల్ థాట్స్ సినిమాస్