Reading Time: 2 mins

చిత్తం మహారాణి మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో నటించిన మూవీ చిత్తం మహారాణి. సుకుమార్ శిష్యుడు ఆకుల కాశీ విశ్వనాధ్ తెరకెక్కించిన చిత్తం మహారాణి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కి మంచి స్పందనే లభించింది ఈ సినిమా టీజర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా విడుదల చేసి ప్రమోట్ చేశారు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లోతెరకెక్కిన ఈ సినిమాకు ఆకుల కాశీ విశ్వనాథ్ కథతో పాటు దర్శకత్వం చేశారు. ఓటీటిలో విడుదలైన చిత్తం మహారాణి సినిమా ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ లైన్

చైత్ర (రచన ఇందర్) బీటెక్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్తుంది. రూ. 10 లక్షల ప్యాకేజీతో జాబ్ సంపాదిస్తుంది. అయితే ఇంటికి తిరిగి వెళ్దామనుకునే సరికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్. ఏం చేయాలో అర్దం కాదు. అప్పుడు తన ఫ్రెండ్ ఇచ్చిన సలాహాతో ఒక యాప్ ద్వారా రచన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఆ యాప్ ద్వారా రచనను ఇంటికి తీసుకెళ్లేందుకు రాజు (యజుర్వేద్ గుర్రం) వస్తాడు. రచన ఊళ్లో రాజు ఒక బైక్ మెకానిక్ వద్దనుకుంటూనే అప్పుడున్న పరిస్థితి దృష్ట్యా రాజు బైక్ ఎక్కుతుంది అసలు రాజుకు రచనకు ఉన్న సంబంధం ఏంటీ? రాజుకు అంతకుముందు జరిగిన పాప కిడ్నాప్ కు సంబంధం ఏంటీ? పోలీసులు రాజు వెంట ఎందుకు పడుతున్నారు? వంటి తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే చిత్తం మహారాణి చూడాల్సిందే.

విశ్లేషణ

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో ఈ కథ జరుగుతుంది. ఈ లాక్ డౌన్ లో ఎంతోమంది తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారనే విషయం ఈ సినిమా గుర్తు చేస్తుంది. చాలా చెక్ పోస్టుల వద్ద ఎంతో మంది నిస్సాహయస్థితిలో కనపించేవారు. కొంతమంది అయితే సైకిళ్లపై, నడుస్తూ వేల కిలోమీటర్లు నడిచిన సంఘటనలు కలిచివేసేవి. ఇలాంటి సంఘనటలను స్ఫూర్తిగా తీసుకుని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంట్రడక్షన్, జాబ్ తెచ్చుకోవడం, లాక్ డౌన్, తర్వాత కిడ్నాప్, పోలీసులు, చెక్ పోస్ట్ లు తదితర సన్నివేశాలతో ఆసక్తిగానే ఉన్నా సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలతో సినిమాటిక్ లిబర్టీ తీసుకోవటంతో విసిగిస్తుంది. కిడ్నాపర్ల కోసం పోలీసులు వెతుకుంటే చెక్ పోస్ట్ వద్ద కమెడియన్ సత్యకు వాళ్ల లవ్ స్టోరీ చెప్పడం స్క్రీన్ ప్లే సమస్యే. ఈ సినిమాకు తీసుకున్న కథ లాక్ డౌన్, లవ్ అండ్ కిడ్నాప్ నేపథ్యమే కావచ్చు కానీ, అది స్క్రీన్ పై చూపించిన విధానం ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక సినిమా ఆఖరు 20 నిమిషాలు ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తో హీరో చెప్పే డైలాగ్ లు కూడా బాగుంటాయి. బైక్ మెకానిక్ గా, లవర్ గా, తల్లి మాట కోసం పని చేసే కొడుకుగా బాగానే నటించాడు హీరో యజర్వేద్ గుర్రం.

సుకుమార్ తో ఆర్య సినిమా నుంచి అసోసియేట్ అయిన శిష్యులలో ఒకరైన కాశీ విశ్వనాధ్ ఈ సినిమాను విజువల్ గా అందంగా మలిచే ప్రయత్నం చేసారు. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ ఓకే అనిపిస్తాడు. మిగతా పాత్రలు బాగానే అలరించాయి. కొన్ని పాటలు మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కామెడీ కూడా సత్య పాత్ర వచ్చినప్పుడు తప్పా మిగతా చోట్ల అంతగా ఏం పండలేదు.

చూడచ్చా :

టైమ్ పాస్ కు చూడాలనుకుంటే మాత్రం ఈ చిత్తం మహారాణి పై ఓ లుక్కేయచ్చు

నటీనటులు :

యజుర్వేద్ గుర్రం, రచన ఇందర్, తులసి, సునీల్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, మధునందన్ తదితరులు

సాంకేతికవర్గం :

సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ. కాశీ
సంగీతం: గౌర హరి
మాటలు: సురేష్ సిద్ధాని
నిర్మాతలు: జేఎస్ మణికంఠ,టీఆర్ ఆర్. ప్రసాద్ రెడ్డి
సమర్పణ: లిటిల్ థాట్స్ సినిమాస్
రన్ టైమ్ : 125 మినిట్స్
ఓటీటీ విడుదల తేది: జనవరి 20, 2023
ఓటీటీ వేదిక: ఆహా