Reading Time: < 1 min
 
చిత్రపటం చిత్రం పాట విడుదల
 
విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన చిత్రపటం పాట
 
సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “చిత్రపటం”.
 
 
పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ  చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ” నింగిని చూసి నేర్చుకున్న…” అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో విడుదల చేశారు.
 
 
అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం   మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. 
 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ,“ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే. దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. పొయెటిక్ గా ఉంటూనే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి” అని అన్నారు. 
 
 
నిర్మాత పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ,**త్వరలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పారు.
 
 
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో కోట శ్రీనివాసరావు, పోసాని, నరేన్, బాహుబలి ప్రభాకర్, శరణ్య పొన్నవన్, బాలాచారి తదితరులు తారాగణం.
 
ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: వినోద్, నిర్మాత: పుప్పాల శ్రీధరరావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం: బండారు దానయ్య కవి.