Reading Time: 2 mins

జాంబీ రెడ్డి మూవీ రివ్యూ

ఫన్నీ బడ్డీ: ‘జాంబీ రెడ్డి’ రివ్యూ

Rating:2.75/5

ఓటీటీల్లో కాకుండా డైరక్ట్ థియోటర్ లో రిలీజైన సినిమా జాంబీ రెడ్డి. టీజర్ నుంచి ట్రైలర్ వరకూ సినిమా పై క్యూరియాసిటీ కలగచేసిన జాంబీ రెడ్డి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూసారు. ఇవాళ ఆ ఎదురుచూపులకు తెరపడింది. జాంబీరెడ్డి సినిమా వెండితెరపై దిగాడు.   సమరసింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తరహాలో జాంబి రెడ్డి అని టైటిల్ పెట్టి ఇంట్రస్ట్ కలిగించిన ఈ సినిమా అదే స్దాయిలో ఎంటర్టైన్ కలగచేసిందా, అసలు జాంబీకు, రెడ్డి అనే పదానికి సంభందం ఏమిటి…అ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ మరోసారి అలాంటి మ్యాజిక్ ని తెరపై చేసారా చూద్దాం.
 
స్టోరీ లైన్

గేజ్ డిజైనర్ అయిన మారియో  (తేజ సజ్జ) కు టెక్నికల్ గా గేమ్ కు ఓ సమస్య ఎదురౌతుంది. ఆ ప్లాబ్లం  తీరాలంటే తన ప్రెండ్ కళ్యాణ్ (ఆర్జే హేమంత్) సాయం అవసరం అవుతుంది. చూస్తేనేమో కళ్యాణ్ ఏమో ఇప్పుడు కరోనా టైమ్ లో కళ్యాణం చేసుకుంటున్నాడు. సరే అని అతను ఉన్న ఊరు కర్నూలు దగ్గర రుద్రవరం బయిలుదేరతాడు. పనిలో పనిగా అటు పెళ్లి ఇటు టెక్నికల్ సమస్య తీరుతాయనేది మారియో ఆలోచన. ప్రెండ్స్ తో కలిసి రుద్రవరం వెళ్లేసరికి అక్కడో సమస్య వీరి కోసం ఎదురుచూస్తూంటుంది. అక్కడ ఓ సైంటిస్ట్ కరోనాకు వాక్సిన్ కనుక్కుంటాడు. అయితే అది వికటిస్తుంది. దాంతో ఆ ఊరివారంతా జాంబీలుగా మారుతూంటారు. మనిషులను కొరికేసి వారి మాంసాన్ని తినేసి మరొకరని జాంబీలుగా మార్చేస్తూం టారు. హీరో, ప్రెండ్స్ తప్పించి మిగతావాళ్లంతా అక్కడ జాంబీలుగా మారిపోయి ఉంటారు. ఈ క్రమంలో అక్కడ నుంచి హీరో, ప్రెండ్స్ కలిసి జాంబీల నుంచి ఎలా తప్పించుకున్నారు.  చివరకి ఏమైంది, ఈ జాంబీల సమస్యలకు పరిష్కారం దొరికిందా వంటి విషయాలు గురించి తెలియాలంటే సినిమా థియోటర్ కు వెళ్లి చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

ఇక ఈ సినిమా ఫస్టాఫ్ సోసోగా ఉన్నా సెకండాఫ్ భలే ఫన్నీగా ఉంది. ఖచ్చితంగా సినిమా చూస్తూ నవ్వుకుంటారు. జాంబీ సినిమా కదా మాకేమీ అర్దం అవుతుందని అనుకోవద్దు. డైరక్టర్ సామాన్యుడుకి కూడా అర్దమయ్యేలా సినిమాని డిజైన్ చేసారు.   గెట‌ప్ శ్రీను, పృథ్వీ, అన్నపూర్ణమ్మ‌, హేమంత్ జాంబీలతో కలిసి తెగ  న‌వ్వించారు. జాంబీలను తీసుకొచ్చి మన తెలుగు ఫ్యాక్షన్ నేపధ్యంలో పెట్టి దానికి మన నేటివిటి అద్దటంతోనే సగం సక్సెస్ అయ్యిపోయారు. అలాగే జాంబీలనగానే హారర్ స్క్రీమ్ పెట్టుకోకుండా ఫన్ గా వెళ్లటం మరింత కలిసొచ్చింది. “జాంబవతి తెలుసుకానీ జాంబీలు ఏంటండీ,” వంటి డైలాగులు సినిమాని ఎక్కడా పడిపోకుండా కాపాడాయి. అయితే స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకు కలిసి రాలేదు. ఫస్టాఫ్ పరమ రొటీన్ గా సీన్స్ సాగతీసి, ఇంటర్వెల్ దాకా విసుగెత్తించారు. సెకండాఫ్ లో విషయం ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చాలా ఇబ్బందైపోయేది. అలాగే సమరసింహారెడ్డి, ఇంద్ర, ఆది, నరసింహనాయుడు,రజనీకాంత్ నరసింహ, చంద్రముఖి ,కాంచన, జంబలి కడిపంబ ఇలాంటి సినిమాల స్పూఫ్ లు వరసపెట్టి చేసేయటం నచ్చలేదు. అయితే కరోనా వ్యాక్సిన్, ఫ్యాక్షనిజం వంటివి మాత్రం సినిమాని కాస్తంత దారిలో పెట్టాయి. 2004 లో వచ్చిన హారర్ కామెడీ Shaun of the Dead ఈ సినిమా కు ప్రేరణ అయ్యుండొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్ ఆ సినిమాని చూస్తున్నట్లు అనిపించాయి.

టెక్నికల్ గా..

ఇలాంటి సినిమాలకు టెక్నికల్ స్టాండర్డ్స్ అవసరం. ఆ విషయం ఈ జనరేషన్ డైరక్టర్ అయిన ప్రశాంత్ వర్మకు తెలుసు కాబట్టి ఫెరఫెక్ట్ గా డిజైన్ చేసారు. ముఖ్యంగా ఈ సినిమాకు మూలస్దంబంగా నిలబడ్డ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ గురించి మాట్లాడకుండా ఉండలేము. అలాగే నాగేంద్ర ఆర్ట్ వర్క్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.  మేక‌ప్ డిపార్టమెంట్  కూడా ఈ సినిమాకి కీల‌కంగా ప‌నిచేసింది.  ప్రశాంత్ వ‌ర్మ డైరక్షన్ బాగుంది కానీ అతని నుంచి ఎక్సపెక్ట్ చేయదగ్గ సినిమా కాదేమో ఇది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీ నటుల్లో తేజ సజ్జా హీరోగా ఎంట్రీ బాగుంది.   ఆనంది, దక్ష హీరోయిన్లుగా ఓకే.  

చూడచ్చా…

మరీ జాంబీలంటే మీకు ఏవగింపు ఉంటే తప్ప ఎంజాయ్ చేయచ్చు.  మీ దగ్గరలో ఉన్న థియోటర్ లో ఈ వీకెండ్ ఈ సినిమా చూసేయండి. జాంబీలతో మీరూ కాసేపు కబుర్లు చెప్పండి. కాలక్షేపంగా ఉంటుంది.
  
తెర ముందు..వెనుక..

నటీనటులు : తేజ సజ్జా, ఆనంది, దక్ష నగార్కర్‌, పృథ్వీ రాజ్‌, గెటప్‌ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు తదితరులు
సంగీతం: మార్క్‌ కె. రాబిన్
కెమెరా: అనిత్,
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌ విల్లే
ఎడిటింగ్‌: సాయిబాబు
ప్రొడక్షన్‌ డిజైన్‌: శ్రీ నాగేంద్ర తంగ‌ల‌
నిర్మాత‌: రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ
ర‌చ‌న‌-దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ
లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఆనంద్‌ పెనుమత్స, ప్రభ చింతలపాటి.
సంస్థ‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌
రన్ టైమ్: 2 గంటల 5 నిమిషాలు
విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021