జై లవకుశ ట్రయిలర్ రివ్యూ

Published On: September 11, 2017   |   Posted By:

జై లవకుశ ట్రయిలర్ రివ్యూ

కెరీర్ లో ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేస్తూ ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ. దీనికి తోడు వెనక జనతా గ్యారేజ్ లాంటి పెద్ద విజయం ఉండనే ఉంది. అందుకే జై లవకుశపై అన్ని అంచనాలు. మరెన్నో ఊహాగానాలు. ఈ భారీ అంచనాల మధ్య విడుదలైంది జై లవకుశ ట్రయిలర్.

అంతా ఊహించినట్టుగానే జై లవకుశ ట్రయిలర్ లో జై, లవ, కుశ మధ్య కనెక్షన్ ను వివరించారు. “ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామలక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది.. కానీ వీళ్లు రావణ రామలక్ష్మణులు అయ్యారు”.. ఈ ఒక్క డైలాగ్ తో సినిమాలో వీళ్లు ఒకరికి ఒకరు ఏమౌతారు.. గొడవ ఎవరి మధ్య అనే విషయం తెలిసిపోతుంది. జై పాత్ర రావణుడిని తలపిస్తే.. లవ, కుశ పాత్రల్ని రామలక్ష్మణులుగా చెప్పుకొచ్చారు.

అయితే ట్రయిలర్ లో మెయిన్ ఎట్రాక్షన్ మాత్రం జై పాత్రే. ఈ పాత్రతో ఎన్టీఆర్ మేజిక్ చేశాడు. నటనలో తనకు తిరుగులేని మరోసారి నిరూపించుకున్నాడు. సినిమా విజయంలో జై పాత్ర ఎంతో కీలకం అనేది ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది. ఇక ట్రయిలర్ లో హీరోయిన్ల ఇంట్రడక్షన్ కూడా ఉంది. ఓవరాల్ గా జై లవకుశ ట్రయిలర్.. సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేలా విడుదలైంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలియాలంటే.. ఈనెల 21 వరకు ఆగాల్సిందే.