జై సింహా ట్రయిలర్ రివ్యూ

Published On: December 26, 2017   |   Posted By:

జై సింహా ట్రయిలర్ రివ్యూ


ఈ సంక్రాంతికి జై సింహా రూపంలో దూసుకొస్తున్నాడు బాలయ్య. సింహా అనే టైటిల్ పెట్టుకున్న ప్రతిసారి హిట్ కొట్టాడు నటసింహం. అందుకే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు కూడా జై సింహా అనే టైటిల్ పెట్టాడు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ఇలా రిలీజైందో లేదో అలా ఇనిస్టింట్ గా హిట్ అయింది.

జై సింహా ట్రయిల్ లో బాలయ్య విశ్వరూపం కనిపించింది. నటసింహం నుంచి నందమూరి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో సరిగ్గా ట్రయిలర్ లో అదే ఉంది. కాకపోతే సినిమా స్టోరీ ఏంటనే విషయంపై మాత్రం ట్రయిలర్ లో కూసింత కూడా క్లారిటీ  ఇవ్వలేదు. పవర్ ఫుల్ డైలాగ్స్, బాలయ్య మేనరిజమ్స్ తోనే నిండిపోయింది ట్రయిలర్.

ఎవడ్రా వాడు.. ఆ కళ్లల్లో పవరేంటి.. ఎక్కడ్నుంచి వచ్చాడు అనే వాయిస్ ఓవర్ తో మొదలైంది జై సింహా ట్రయిలర్. ప్రతి ఫ్రేమ్ లో యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు. మధ్యమధ్యలో నయనతార-బాలకృష్ణ కాంబినేషన్ ట్రయిలర్ లో కనువిందు చేసింది. ఇక బాలయ్య చెప్పిన సింహం మౌనంగా ఉందని.. అనే డైలాగ్ టోటల్ ట్రయిలర్ కే హైలెట్ గా నిలిచింది. చిరంతన్ భట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జై సింహాను మరింత పవర్ ఫుల్ గా మార్చింది. ఓవరాల్ గా జై సింహా సినిమాతో ఈ సంక్రాంతికి థియేటర్లలో గర్జించడానికి రెడీ అయ్యాడు నటసింహం