టైటిల్ సాంగ్ చిత్రీకరణలో ఉపేంద్ర గాడి అడ్డా మూవీ
ఫిలిం సిటీలో టైటిల్ సాంగ్ చిత్రీకరణలో ఉపేంద్ర గాడి అడ్డా
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం లో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఉపేంద్ర గాడి అడ్డా చిత్రం టైటిల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది.* పోకిరీ జులాయిలు లత్కోరు లంకాధిపతులుదుశ్శాసన దుర్యోధన బధ్మాష బస్మాసురులు అంటూ సాగే ఈ పాటను హీరో కంచర్ల ఉపేంద్ర, వందమంది జూనియర్ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్ల పైన భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట తర్వాత ఇంకో పాటను ఊటీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.ఈ విషయాన్ని నిర్మాత కంచర్ల అచ్యుతరావు మీడియాకు తెలియజేస్తూ, సినీ హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర ఆసక్తిని గమనించి తనతో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తున్నాను. ఐదు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి. మిగతా వాటికంటే ఈ సినిమానే ముందు పూర్తయింది. మరోవైపు ఎడిటింగ్ కూడా పూర్తయింది. ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ నేను చెప్పిన కథ నచ్చి, నిర్మాత, హీరో ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. ఉపేంద్ర ఓ కొత్త హీరోలా కాకుండా చక్కటి నటనను కనబరుస్తున్నారు. నిర్మాత సంపూర్ణ సహకారంతో పాటు వారు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మొదలు పెట్టిన నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగలిగాను.చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది.
ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. హీరో పాత్ర పక్కా మాస్ అయితే హీరోయిన్ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది అని చెప్పారు.
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ ఓ కొత్త హీరోగా పరిచయం కాబోతున్న నన్నుపెట్టి మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నిజంగా చాలా గ్రేట్. ఇంతలా ప్రోత్సహించే తండ్రికి కుమారుడిగా పుట్టడం పూర్వ జన్మ సుకృతం. యూత్ ను ఆకట్టుకునే మంచి పాయింట్ తో దర్శకుడు ఈ సినిమాను ఎంతో బాగా మలుస్తున్నారు అని అన్నారు.