Reading Time: 3 mins

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇంటర్వ్యూ

రవితేజ గారితో సినిమా నా డ్రీమ్ ధమాకా కంప్లీట్ కమర్షియల్ ఫార్మెట్ లో వుండే రవితేజ మార్క్ సినిమా : డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా . రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ధమాకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ధమాకా గురించి చెప్పండి ?
రవితేజ గారితో సినిమా చేయడం నా చాలా రోజుల కల. నాకు ఇష్టమైన హీరోల్లో రవితేజ గారు ఒకరు. ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో వుండే రవితేజ మార్క్ సినిమా ధమాకా. రవితేజ గారిని ఎలా చూడాలని అనుకున్నానో ఆలా తెరపై చూపించాను. రవితేజ గారితో సినిమా అంటే ప్రయోగాలు చేయాలని అనుకోను. ఈ సంగతి రవితేజ గారికి కూడా చెప్పాను. తెరపై రవితేజ గారిని రవితేజలా చూసి చాలా కాలమైయింది. ఈ మధ్య విభిన్నమైన పాత్రలు ఆయన బాగా ప్రయత్నించారు. అయితే ప్రేక్షకులు ఎక్కడో రవితేజని మిస్ అయ్యారు. మళ్ళీ ఆ రవితేజని చూపించాలని అనుకుంటున్నానని రవితేజ గారితో చెప్పా. ఆయకీ ఇది నచ్చింది. కరెక్ట్ టైమింగ్ లో ఇలాంటి సినిమా చేయాలి. చేద్దాం అని ఆయన చెప్పడంతో ధమాకా సినిమా స్టార్ట్ అయ్యింది.

నా గత చిత్రాలు నేను లోకల్, సినిమా చూపిస్తా మామా, హలో గురు ప్రేమ కోసమే, మేం వయసుకు వచ్చాం సినిమాలు ఎనర్జిటిక్ గా వుంటాయి. రవితేజ గారు ఎనర్జిటిక్ హీరో, నా సినిమాలు కూడా ఎనర్జిటిక్ వుంటాయి. ఈ రెండు ఎనర్జీలు కలిస్తే ఎలా వుంటుందో అనే క్యూరీయాసిటీ ప్రేక్షకుల్లో వచ్చింది. దీనికి ఎక్కడా తగ్గకుండా ఉండటానికి విశ్వ ప్రయయత్నాలు చేశాం. ఈ సినిమాకి డబుల్ ధమాకా అనే క్యాప్షన్ పెట్టడానికి కారణం కూడా అదే. నా గత సినిమాలని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారు. దానికి రెట్టించి ధమాకాని ఎంజాయ్ చేస్తారు.

మొదట హీరోయిన్ శ్రీలీలని కొత్త అమ్మాయి అన్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల డిమాండ్ హీరోయిన్ అయ్యింది. నేను లోకల్ తర్వాత కీర్తి సురేష్ ఎలా బిజీ అయ్యిందో ధమాకా విడుదలకు ముందే శ్రీలీల బిజీ అయ్యింది. శ్రీలీల చాలా ఎనర్జిటిక్ అండ్ ట్యాలెంటడ్, అద్భుతమైన డ్యాన్సర్, తనే సొంతగా డబ్బింగ్ చెప్పింది.

ధమాకా లో జయరామ్ గారు విలన్ గా చేశారు. ఆయన ఇది వరకూ విలన్ గా చేశారు. ఎక్కువగా సాఫ్ట్ విలనీ వుంటుంది. ఇందులో మాత్రం కంప్లీట్ నెగిటివ్ రోల్. ఇంత నెగిటివ్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని జయరాం గారు అన్నారు. విలన్ గా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య గారి ట్రాక్ ఎంత ఎంజాయ్ చేస్తామో ధమాకాలో రావు రమేష్, హైపర్ ఆది గారి ట్రాక్ అంత అద్భుతంగా వుంటుంది. వీరి ట్రాక్ ఆద్యంతం అలరిస్తుంది.

ధమాకా మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రిలీజైన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. సినిమా చూపిస్తా మామా నుండి రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో జర్నీ వుంది. ధమాకాకి అద్భుతమైన కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే బుల్లెట్ లాంటి డైలాగులు రాశాడు. కెమరామెన్ కార్తి ఘట్టమనేని కూడా అద్భుతమైన వర్క్ చేశారు. విజువల్స్ అన్నీ వండర్ ఫుల్ గా వుంటాయి. హీరో స్టార్ట్ డమ్ ని ఫాలో అవుతూ వందకు వంద శాతం న్యాయం చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అద్భుతమైన సెట్స్ వేశారు. కాలనీ, ఆఫీసు సెట్స్ వేశాం. అలాగే పీపుల్ టెక్ ఆఫీస్ ఏడు అంతస్తులని కూడా ఒక స్టూడియోలా వాడం. ఎడిటర్ ప్రవీణ్ పూడి నా మొదటి సినిమా నుండి కలసి వర్క్ చేస్తున్నాం. ధమాకాకి కూడా బ్రిలియంట్ వర్క్ చేశారు. ధమాకా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్. డిసెంబర్ 23న విడుదలౌతుంది. క్రిస్మస్ వేడుకలో మా ధమాకాతో మొదలైపోతాయనే నమ్మకం వుంది. నా గత చిత్రాలని ఎలా ఆదరించారో ధమాకాని కూడా లానే చూసి అశీర్వాదిస్తారాని కోరుతున్నాను.

రచయిత ప్రసన్న కుమార్ ధమాకా రౌడీ అల్లుడు కి మరో వెర్షన్ లా వుంటుందని అన్నారు ?
ధమాకా పక్కా కమర్షియల్ సినిమా. ప్రసన్న చెప్పినట్లు రౌడీ అల్లుడు లాంటి సినిమా చేద్దామని చేసిన సినిమానే ధమాకా. ఇందులో రవితేజ డబుల్ రోల్. హీరోయిన్ ఒక్కరే. చివరికి ఎవరికి వెళుతుందో సినిమా చూసి తెలుసుకోవాలి(నవ్వుతూ). రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. ఇద్దరూ పోటీపడి డ్యాన్స్ చేశారు. మరో పాట విడుదల చేయడానికి వుంది. దగ్గరలో విడుదల చేస్తాం. ఆ పాట మరో స్థాయిలో వుంటుంది.

ట్రైలర్ లో వినిపించిన డైలాగులు ఎవరినైనా ఉద్దేశించి రాసినవా ?
అదేం లేదండీ. త్రివిక్రమ్ గారి గురించి రాసిన డైలాగ్ ని ఆయన చాలా ఎంజాయ్ చేశారు. స్వయంగా ఫోన్ చేసి చాలా సరదాగా మాట్లాడారు. ఇక రవితేజ గారు బ్యాగ్రౌండ్ గురించి చెప్పిన డైలాగు లో కూడా చాలా పాజిటివిటీ వుంది. చాలా మంది ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటేనే రాణించగలమని అనుకుంటారు. కానీ బ్యాగ్రౌండ్ లేకుండా కూడా ఇక్కడ రాణించవచ్చని రవితేజ గారు లాంటి హీరోతో చెప్పిస్తే అందరికీ ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుందనే ఉద్దేశమే తప్పా మరొకటి కాదు.

డబుల్ రోల్ ఎంత కొత్తగా వుండబోతుంది ?
రెండు కూడా క్యారెక్టరైజేషన్ బెస్ద్ క్యారెక్టర్లు. రెండు డిఫరెంట్ గా వుంటాయి. అలాగే రెండిటికీ రెండు ఎమోషన్స్ వుంటాయి. సినిమా అంతా క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని నడుస్తాయి. సినిమా చుసినపుడు చాలా కిక్ వుంటుంది. ఇందులో బ్యూటీ ఫుల్ లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ వున్నాయి. రవితేజ ఇమేజ్ స్టార్ డమ్ తగ్గట్టు మాస్ యాక్షన్ కూడా అద్భుతంగా వుంటుంది.

రచయిత ప్రసన్న తో మీ బాడింగ్ గురించి ?
మా ఇద్దరి బాగా సింక్ అయ్యింది. తను త్వరలో చాలా మంచి దర్శకుడు కాబోతున్నాడు. దర్శకుడిగా తన మార్క్ ని చాటుకుంటాడనే నమ్మకం వుంది.

ధమాకా నిర్మాతలు గురించి ?
విశ్వప్రసాద్, వివేక్ గారు చాలా కంఫర్ట్ బుల్ నిర్మాతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తారు. చాలా మంచి వ్యక్తులు. సినిమాలు తీయలాని ఫిక్స్ అయ్యారు. ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు కావాలి.

కొత్తగా చేయబోయే సినిమాలు ?
మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయాలి. అలాగే కృష్ణ గారు దిల్ రాజు గారితో ఒక సినిమా చేయాలి.

మీకు రవితేజ గారు ఇచ్చిన కాంప్లీమెంట్

రవితేజ గారు నన్ను బెస్ట్ ఆడియన్ అంటారు. ఆడియన్ ఏదైతే ఎంజాయ్ చేస్తాడో డైరెక్టర్ గా అది నువ్వు ఎంజాయ్ చేస్తుంటావు. అందుకే నీకెప్పుడూ సక్సెస్ వుంటుంది అన్నారు

ఆల్ ది బెస్ట్
థాంక్స్