Reading Time: 4 mins

తెప్పసముద్రం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో…

మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ..మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సోమచ్. తెప్పసముద్రం చిన్న చిత్రమని చెప్పలేం. ఇదొక మంచి చిత్రం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అని అన్నారు.

జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య మాట్లాడుతూ..ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను. సెకెండాఫ్ చాలా అద్భుతంగా ఉంది. సమాజంలో యదార్థ ఘటనలను నిర్భయంగా తెరమీదకు తీసుకొచ్చారు. బాలికలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమా ఉంది. హాజీపూర్ ఘటనను తలపించేలా ఈ సినిమా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. కంటెంట్ ఉన్న ప్రతి చిన్న సినిమానూ ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఫస్ట్ టైమ్ రజాకార్ సినిమాకు గెస్ట్‌గా వచ్చా. ఇప్పుడు తెప్పసముద్రం సినిమా కోసం వచ్చా. సైంటిస్టుల తర్వాత నేను గౌరవించేది సినిమా రంగంలోని క్రియేటర్స్‌నే. కమల్ హాసన్ మహానది లాంటి సినిమాలు ఆలోచింప చేసేలా ఉంటాయి. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేసుకున్న తెప్పసముద్రం టీమ్‌కు అభినందనలు. ఈ సినిమాకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు లేరు. అందరూ మధ్య తరగతివారే పని చేశారు. తెప్పసముద్రం లాంటి సినిమా హిట్ అయితే కృష్ణానగర్‌లోని ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది. తెప్పసముద్రం అనే మంచి సినిమాను తెలుగువారందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అని చెప్పారు.

నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ..ఇదొక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే మంచి సినిమాలు మరో పది వస్తాయి. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి అని చెప్పారు.

లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ..డైరెక్టర్ సతీష్ గారు నాకు పదేళ్లుగా స్నేహితుడు. ఒక నీటి చుక్క లాంటి ఆలోచన ఈరోజు ఒక సముద్రంగా మారిందనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే డైరెక్టర్ గారు మందే ఊహించి తెప్పసముద్రం అనే టైటిల్ పెట్టారు. ఇందులో నేను ఒక పాట రాశాను. మంగ్లీ గారు పాడారు. సినిమా అంటే కేవలం కళ కాదు. ఇది ఎంతోమందికి జీవనోపాధి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. కిషోరి గారి కొరమీను సినిమాకు అన్ని పాటలూ నేనే రాశాను. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి టీమ్ అందరికీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ఎడిటర్ సాయిబాబు మాట్లాడుతూ..జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలతో ఎడిటర్‌గా నాకు అవకాశం ఇచ్చిన నా దర్శకుడు ప్రశాంత్ వర్మగారికి థ్యాంక్యూ. చిన్న సినిమాకు మీడియా ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో హనుమాన్‌తో నిరూపించారు. అలాగే ఈ సినిమాను కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. నిజంగా ఇదొక మంచి సినిమా. అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా. అని అన్నారు.

డీఓపీ శేఖర్ మాట్లాడుతూ…నాకు అవకాశం ఇచ్చిన సతీష్ గారికి థ్యాంక్యూ. ఈ సినిమా 19న విడుదల అవుతోంది. సినిమా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నా అని అన్నారు.

కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ మాట్లాడుతూ..హీరో అర్జున్ అంబటి గారే నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఢీలో పెర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు పరిచయం చేశారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదల అవుతుంది. అందరూ వచ్చి చూడండి అని అన్నారు.

ఫైట్ మాస్టర్ శంకర్ మాట్లాడుతూ..ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాను ఈ నెల 19న థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నా. అని అన్నారు.

యాక్టర్ యోగి మాట్లాడుతూ..డైరెక్టర్ సతీష్ గారు ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు మంచి పేమెంట్ ఇచ్చారు. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుతున్నా అని అన్నారు.

యాక్టర్ చైతన్య మాట్లాడుతూ..నేను ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. సినిమాలో నన్ను చాలా మంచి గుర్తుపట్టలేరు. నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకు ఈ సినిమా చాలా స్పెషల్. ఈ సినిమాలో నా కూతురే హీరోయిన్. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. నేను క్యారెక్టర్ అడక్కుండానే నన్ను చేయమని చెప్పారు. ఈ సినిమా అన్ని థ్రిల్లర్ సినిమాల్లా కాదు.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమాను 19న అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.

చిత్ర నిర్మాత రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ..నేను కొత్త నిర్మాతననే భావన లేకుండా ఇక్కడున్న ప్రతిఒక్కరూ నాకు ఎంతగానో సహకరించారు. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. చైతన్యగారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ సినిమా డిస్కన్ జరిగింది. అలా ఈ సినిమా ప్రారంభమైంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఎంతోమంది కష్టపడాలి. డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి అభిమానిని. అలాంటి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ నెల 19న అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా అని చెప్పారు.

హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ..ఈ సినిమా నాకు చాలా స్పెషల్. టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ సినిమా. రాఘవేంద్రగారు, సతీష్ గారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ. విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్ కూడా సినిమాలో ఇంకా చాలా బాగుంటుంది. నాకు డ్యాన్స్ నేర్పించి స్టెప్పులేయించిన మాస్టర్‌కు థ్యాంక్యూ. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుతున్నా అని అన్నారు.

డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు చైతన్య గారు నన్ను నిర్మాతకు పరిచయం చేశారు. ఒక నెల రోజుల్లో టీమ్ సెట్ అయింది. ప్రతి ఒక్క టెక్నీషియన్ అద్భుతంగా పని చేశారు. తెప్పసముద్రంలో చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ ఉన్న సినిమాను మీడియా ఎప్పుడూ ఆదరిస్తుంది. అలాగే ఈ సినిమాను కూడా జనాల వద్దకు తీసుకెళ్లాలని కోరుతున్నా. అని అన్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ..ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. చిన్న సినిమా అనగానే కాస్ట్ అండ్ క్రూ వచ్చామా.. పని చేశామా.. డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లు ఉంటారు. కానీ డైరెక్టర్, నిర్మాతకు తడిసి మోపెడవుతుంది. సినిమా రిలీజ్ వరకూ వాళ్లు చాలా వేదన పడుతుంటారు. మా నాన్న, పెద్దనాన్ని డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఆ వేదన నాకు తెలుసు. ఇలాంటి డైరెక్టర్, నిర్మాతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. వీళ్లకు తెలిసింది సినిమా ఒక్కటే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా. ఈ సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 19న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా అని చెప్పారు.

నటీనటులు :

చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్

టెక్నికల్ టీం :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలు
నిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్
బ్యానర్: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: : పి.ఆర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి
ఎడిటర్: సాయిబాబు తలారి