Reading Time: < 1 min
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ 
 
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్  హైదరాబాద్ లో జరిగాయి. దీనికి ప్రెసిడెంట్ గా పి . రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారుడిగా ప్రముఖ నిర్మాత ఏ .యమ్ రత్నం,  వైస్ ప్రెసిడెంట్ గా నిర్మాత గురు రాజ్, రంగా  రవీంద్ర గుప్త,  అలీ భాయ్,  సెక్రెటరీస్ గా కె .వి. రమణా  రెడ్డి,  కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్ సెక్రెటరీస్ గా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీస్ గా  సతీష్, నాగరాజు గౌడ్ , జి. శంకర్ గౌడ్,  కోశాధికారి గా  రామానుజం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  వీరితో పాటుగా ఈసీ మెంబర్స్ గా వి. కృష్ణ రావు, హెచ్ కృష్ణ రెడ్డి, అలెక్స్ , ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి.  శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్ . వెంకటేష్, ముఖావర్  వలి , మహాలక్ష్మి , బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
ఎలక్షన్స్ అనంతరం  తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్  ప్రెసిడెంట్ పి . రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ …  “ తెలంగాణ ఫిలిం ఛాంబర్  బిల్డింగ్ నిర్మాణానికి స్థల కేటాయింపు  , పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల  కోసం స్థల కేటాయింపు , కల్చరల్ సెంటర్ కోసం  స్థల కేటాయింపు తో పాటు   24 క్రాఫ్ట్స్ లో వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం.  త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలనీ తీర్మానించుకున్నాం “ అన్నారు.