తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్
వి పి ఎఫ్ చార్జీల విషయంపై తెలుగు సినీ నిర్మాతల మండలి
జరుపుతున్న చర్చల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ క్రింది వాటిని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది.
1.డిసెంబర్ 2020 లో విడుదలయ్యే సినిమాలకు వి.పి.ఎఫ్ చార్జీలు ఉండవు.
2.జనవరి, ఫిబ్రవరి, మార్చి 2021 లో విడుదలయ్యే సినిమాలకు గాను డిజిటల్ చార్జీలలో 40 శాతం నిర్మాతలే చెల్లిస్తారు.
3.డిజిటల్ సర్వీస్ ఛార్జీల సన్ సెట్ క్లాజ్ నిబంధన విషయమై తెలుగు నిర్మాతల మండలి చర్చలు చేపట్టడం జరిగింది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు దీనిపై ఒప్పందం జరిగే అవకాశముంది.
ఇతర రాష్ట్రాల్లో ఈ విషయాలపై చర్చలు జరుగుతున్నందున అక్కడ ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే అవి తెలుగు సినిమాలకు కూడా వర్తింప గలవని ఆశిస్తున్నాము.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీని పునః ప్రారంభించడానికి, పునః నిర్మించడానికి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు సహకరిస్తారని ఆశిస్తున్నాము
(ప్రసన్న కుమార్) గౌరవ కార్యదర్శి
(మోహన్ వడ్లపట్ల) గౌరవ కార్యదర్శి