తెల్లవారితే గురువారం మూవీ రివ్యూ

Published On: March 27, 2021   |   Posted By:
 
తెల్లవారితే గురువారం మూవీ రివ్యూ

తెల్లవారలేదు: ‘తెల్లవారితే గురువారం’ మూవీ రివ్యూ

Rating:2/5

ఈ చిన్న సినిమాకు ఉన్న ఒకే ఒక ఆకర్షణ. ఈ చిత్రం హీరో చేసిన గత చిత్రం మత్తు వదలరా హిట్ అవ్వటం. ఆ సినిమాలాగే ఈ సినిమాకూడా ఉంటుందేమో జనాల్లో క్యూరియాసిటీ కలిగింది. మత్తువదలరా సినిమా థ్రిల్లర్ అయినా బాగా నవ్వించారు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ అని టీజర్స్, ట్రైలర్స్ లో చెప్పారు. దానికి తోడు ఈ సినిమాకు ఎన్టీఆర్ వంటి స్టార్స్ వచ్చి ప్రమోషన్స్ చేసారు. అవన్నీ సినిమాకు ఎంతవరకూ ఉపయోగపబడ్డాయి. ఈ సినిమా కథేంటి…టైటిల్ లో ఉన్న గురువారం ప్రాధాన్యత ఏమిటి ,  ట్రైలర్ చూస్తే ‘తెల్లవారితే గురువారం’ ఓ కామెడీ రైడ్ అనిపిస్తుంది.అది నిజమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

వీరేంద్ర అలియాస్‌ వీరు(శ్రీసింహ),  మధు (మిషా నారంగ్‌)లకి తెల్లవారితే గురువారం అనగా పెళ్లి. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎవరి కారణాలువారికు ఉన్నాయి. దాంతో ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు పెళ్లి పీటలు ఎక్కకుండా పరారు అయ్యారు. అయితే ఆ తర్వాత జర్నీలో వీళ్లిద్దరు కలిసారు. ఈ క్రమంలో తాము ఎందుకు ఆ పెళ్లి వద్దనుకుంటున్నారో ఫ్లాష్ బ్యాక్ లు చెప్పుకున్నారు. అసలు వాళ్ల ప్లాష్ బ్యాక్ కథలేంటి..ఆ రాత్రి వాళ్లిద్దరు కలిసి ఏం చేసారు. తెల్లారి వీళ్లిద్దరు పెళ్లి జరిగిందా..మధ్యలో డాక్టర్‌ కృష్ణవేణి(చిత్ర శుక్లా) పాత్ర ఏమిటి…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే విశ్లేషణ

డైరక్టర్ మణికంఠ  ఈ సినిమా కోసం చాలా సింపుల్ గా కాంప్లికేషన్ లేని కాంప్లిక్ట్ కూడా పెద్దగా అనిపించని థీమ్ ని,స్టోరీ లైన్ ని ఎంచుకున్నాడు. వద్దనుకుంటున్న పెళ్లిని తప్పించుకునే  ప్రాసెస్ లో పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు ఎలా ఒకటయ్యారు అనేది చెప్దాముకున్నాడు. అందుకోసం కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. చాలా ట్రెడిషనల్ క్యారక్టర్స్ ని తీసుకోవటంతో సీన్స్ అలాగే వచ్చాయి. డైలాగ్స్ కూడా దాంతో చాలా మామూలుగా అనిపించాయి. అదే పాత్రల్లో వైవిధ్యం ప్లాన్ చేస్తే కథ వేరే వింథంగా ఉండేది. దానికి తోడు ఇలాంటి లవ్ స్టోరీలు గతంలో చూసి ఉండటం కూడా మైనస్ గా మారింది. సినిమాలో  సందర్భానుసారంగా వచ్చే కామెడీతో సినిమాని నడిపించాలి అనుకోవటం మంచి ఆలోచన. అయితే ఆ ఫన్ పీక్స్ కువెళ్లలేదు. ఫస్టాప్ అక్కడక్కడా లాగినట్లు అనిపించినా,  ఓకే పర్లేదులే అనే ఫీలింగ్ ఇచ్చింది. కానీ సినిమాకి కీలకమైన సెకండాఫ్ లో మాత్రం క్యారక్టర్స్ కి,కథకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వ లేదు. సింహా – మిషలని కలపడానికి రాసుకున్న ఎమోషనల్ సీన్స్ లో లాజిక్ గానీ, మ్యాజిక్ గానీ ఏదీ లేకపోవటమే దెబ్బకొట్టింది. ఇలాంటి జానర్స్ల్ లో పండిపోయిన డైరక్టర్స్ చేయాల్సిన సినిమా ఇది. ఆ అనుభవలేమి ట్రీట్మెంట్ వెర్షన్ లోనే కనపడింది.
 

దర్శకత్వం..మిగతా విభాగాలు

 
కొత్త డైరక్టర్ బాగానే కష్టపడ్డాడు.  డైరక్టర్ నవ్వించటానికి చేసిన ప్రయత్నాలు సినిమాలో చాలా చోట్ల వర్కవుట్ అయ్యాయి. కామెడీ చేయటమనేది కష్టమైన వ్యవహారం. దాన్ని చాలా వరకూ సునాయశంగానే చేయగలిగాడు. అంటే డైరక్టర్ గా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే అతని సక్సెస్ కు రాసుకున్న స్క్రిప్టే దెబ్బకొట్టింది. స్క్రీన్ ప్లే మరీను. అయితే తన సోదరుడు సినిమాకు భైరవ మంచి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటర్ మాత్రం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూ సీన్స్ లో ల్యాగ్ ఉంచేసాడు. అజయ్ ట్రాక్ అసలే సినిమాకి అవసరం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ లో తన ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ తో విజువల్ మూడ్ ని క్రియేట్ చేయడంలో తన వర్క్ పరంగా బెస్ట్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చిన్న సినిమాను రిచ్ గా చూపించాయి. డైలాగులు కూడా బాగా రాసారు.

నటీనటుల్లో

సింహా మొదటి సినిమాకు ఈ సినిమాకు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా స్మార్ట్ గా ఈ సినిమాలో ఉన్నాడు. కృష్ణవేణిగా చేసిన చిత్రా శుక్ల ఫెరఫార్మెన్స్ బాగుంది. కన్ఫూజ్ అమ్మాయిగా ఆమె అదరకొట్టింది. హీరోయిన్  మిషా నాంగ‌ర్ జస్ట్ ఓకే అనిపించింది. కమిడియన్ సత్య ఈ సినిమాలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. తన డైలాగ్స్,ఎక్సప్రెషన్స్ తో సినిమాని ఒంటిచేత్తో నిలబెట్టాడు. సత్య వన్ వే కాన్వర్షన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.  వైవా హర్ష కూడా  బాగా నవ్వించాడు.


చూడచ్చా….

ఏమీ ఎక్సపెక్ట్ చేయకుండా చూస్తే కాసేపు నవ్వుకోవచ్చు.


తెర వెనక..ముందు

సంస్థ‌‌: వారాహి చ‌ల‌న‌చిత్రం, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
న‌టీన‌టులు: శ్రీ‌సింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా, రాజీవ్ క‌న‌కాల‌, స‌త్యా, అజ‌య్‌, వైవా హ‌ర్ష‌, శ‌ర‌ణ్యా ప్ర‌దీప్‌, గిరిధ‌ర్‌, ప్రియ‌, ర‌వివ‌ర్మ‌, పార్వ‌తి, సిరి హ‌నుమంత్‌, మౌర్య‌, ప‌ద్మావ‌తి త‌దిత‌రులు;
సంగీతం: కాల‌భైర‌వ‌;
ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ ర‌గుతు;
 ర‌చ‌న‌: నాగేంద్ర పిళ్లా;
ఎడిటర్: స‌త్య గిడుతూరి;
పాట‌లు: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ర‌ఘురామ్‌, కృష్ణ వ‌ల్లెపు;
నిర్మాత‌లు: ర‌జని కొర్ర‌పాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని;
ద‌ర్శ‌కత్వం: మ‌ణికాంత్ గెల్లి;
రన్ టైమ్: 2 గంట లు
విడుద‌ల‌: 27-03-2021