Reading Time: 2 mins
తొలికిరణం చిత్రం  డిసెంబర్ రిలీజ్
 
 
 
ఏవియమ్ ఆర్ట్ ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ బేబీ మేరీ విజయ సమర్పించు తొలికిరణం చిత్రం డిసెంబర్ 20.న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎమ్.ఆర్.సి నాయుడు నిర్మించారు.
 
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు సాగర్, దర్శకుడు వేణు, భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్బంగా దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ… 
చిత్ర యూనిట్ అందరికి అభినందనలు. సినిమా ఆలస్యం అయినప్పటికీ గొప్పగా ఉంటుంది. మాకు సహకరించిన మీడియా వారికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన భాను చందర్ గారికి థాంక్స్. దర్శకుడు సాగర్ గారు మాకు అన్ని విధాలా సహకరించారు అన్నారు.
 
నిర్మాత ఎమ్.ఆర్.సి నాయుడు మాట్లాడుతూ…
మీడియా వారందరికీ ధన్యవాదాలు, మాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాను రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కించడం జరిగింది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరికి నచ్చే విధంగా ఉంటుందన్నారు.
 
ఆర్టిస్ట్ పి.డి.రాజు మాట్లాడుతూ…
దాదాపు మూడు ఏళ్లనుండి మేము ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. దేవుడి దీవెనలతో సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.
 
 
దర్శకుడు సాగర్ మాట్లాడుతూ…
నేను సినిమా చూశాను, బాగా నచ్చింది. క్రిస్టమస్ సందర్బంగా డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. పెద్ద రేంజ్ సినిమా అవుతుంది తొలికిరణం. గొప్ప సినిమా అవ్వాలనే సంకల్పంతో ఈ సినిమాను నిర్మించారు నిర్మాత. విజయ్ చందర్ కారుణామయుడు చిత్రం కంటే ఎక్కువగా తొలికిరణం సక్సెస్ అవుతుందని అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
భానుచందర్ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. తొలికిరణం టైటిల్ అద్భుతంగా ఉంది. అన్ని మతాల వారికి ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంది, చెడు మీద మంచి ఎప్పటికి విజయం సాధిస్తుంది అనే అంశం ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. దర్శకుడు జాన్ నన్ను జీసెస్ పాత్ర చెయ్యమని అడిగితే నేను చెయ్యలేదు. ఆ పాత్ర చెయ్యడానికి పవిత్రత కావాలని ఒప్పుకోలేదు. ఆ తరువాత డైరెక్టర్ జాన్ నన్ను రీసెర్చ్ చేసే పాత్ర గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకోవడం జరిగింది. చిత్ర డబ్బింగ్ చెబుతున్న సమయంలో నాకు థ్రిల్లింగ్ గా అనిపించింది. ప్రేక్షకులకు రేపు డిసెంబర్ 20న థియేటర్ లో అదే ఫీలింగ్ కలుగుతుందని భావిస్తున్నాను, తొలికిరణం చిత్రాన్ని సక్సెస్  చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.