తొలి శ్వాస చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
మలి షెడ్యూల్ లో ‘తొలి శ్వాస’
‘మిస్టర్ తెలంగాణ, మిస్టర్ సౌత్ ఇండియా’ టైటిల్స్ విన్నర్ ప్రీతమ్ అల్లాడి నటిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం ‘తొలి శ్వాస’. ప్రీతమ్ సరసన శిఖా బాత్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఖాలిద్ దర్శకత్వంలో జుబైర్ నిర్మిస్తున్నారు. సంధ్యా జనక్, వైభవ్, మణి మహేష్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
విజయవంతంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ అక్టోబర్ 3న వరంగల్ లో మొదలు కానుంది. ప్రేమలోని సరి కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం తమ హీరో ప్రీతమ్ అల్లాడికి మంచి పేరు తీసుకు వస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.