థాంక్యూ బ్రదర్ చిత్రం ఏప్రిల్ విడుద‌ల

Published On: April 18, 2021   |   Posted By:
థాంక్యూ బ్రదర్ చిత్రం ఏప్రిల్ విడుద‌ల‌
 
ఏప్రిల్ 30న ‘థాంక్యూ బ్రదర్’ … రిలీజ్ డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య‌
 
అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’.  ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. యువ‌కుడికి, గ‌ర్భ‌వ‌తిగా ఉన్న మ‌హిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ట్రైల‌ర్‌ను అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి స‌హా నెటిజ‌న్స్  అంద‌రినీ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. 
 
ఏప్రిల్ 30న విడుద‌ల కానున్న ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రిలీజ్ డేట్‌ను అక్కినేని నాగ‌చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ‘డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం క్లైమాక్స్‌ను అస‌లు మిస్ చేసుకోకండి’ అని ట్వీట్ చేశారు చైత‌న్య‌. 
 
హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ స‌మ‌ర్ప‌ణ‌లో ఆస‌క్తి క‌రంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఎగ్జ‌యిటింగ్ క్లైమాక్స్‌తో  రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’  చిత్రం ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అద్భుత‌మైన విజువ‌ల్స్‌, టాలెంటెడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను చివ‌రి నిమిషం వ‌ర‌కు ఎంగేజ్ చేస్తుంది.  
 
న‌టీన‌టులు:
 
అన‌సూయ భ‌రద్వాజ్‌, విరాజ్ అశ్విన్‌, అర్చ‌నా అనంత్‌, అనీష్ కురువిల్లా, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, మోనికా రెడ్డి, హ‌ర్ష చెముడు త‌దిత‌రులు
 
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  రమేష్ రాప‌ర్తి
నిర్మాత‌లు:  మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ:  సురేష్ ర‌గుతు
సంగీతం:  గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
ఆర్ట్‌:  పురుషోత్తం ప్రేమ్‌