థాంక్యూ మూవీ రివ్యూ

Published On: July 22, 2022   |   Posted By:

థాంక్యూ మూవీ రివ్యూ

Thank You:నాగ చైతన్య “థాంక్యూ” రివ్యూ

Emotional Engagement Emoji

👎

కొన్ని సినిమాలు వెంటనే చూడాలనిపిస్తాయి. మరికొన్ని మెల్లిగా చూద్దాంలే అని బద్దకాన్ని క్రియేట్ చేస్తాయి. ఓటిటిలో వచ్చాక ట్రై చేద్దాంలే అని మరికొన్ని చెప్తాయి. “థాంక్యూ”కు పెద్దగా బజ్ రాలేదు. కంటెంట్ బాగుంటే మెల్లిగా జనం పోగువుతారు. మౌత్ టాక్ స్ప్రెండ్ అవ్వాలి. అయితే ఈ సినిమాలో అలా జనాల్ని లాక్కొచ్చే మ్యాటర్ ఉందా…కథేంటి…?

క‌థ:

అమెరికాలో ఉంటూ తన తెలివితో ఓ యాప్ ని క్రియేట్ చేస్తాడు అభిరామ్ (నాగ‌చైత‌న్య) . అది హై సక్సెస్ అవటంతో ఓ కార్పోరేట్ ప్రపంచాన్ని క్రియేట్ అవుతుంది. ప్రియ (రాశీఖ‌న్నా) ఫైనాన్సియల్ గా అభికి సపోర్ట్ చేస్తూ .. ప్రేసిస్తూ సహజీవనంలో ఉంటుంది. అభి కెరిర్ లో ఎదుగుతున్న కొలదీ కళ్ళల్లో ఆనందం, కల్మషం లేని చిరు నవ్వు అన్నీ మాయమైపోతూంటాయి. అతని స్వార్దం పూరిత ఆలోచనలు ఆమెకు బాధ కలిగిస్తాయి. ఈ లోగా అతన్ని సాయం అడగటానికి వచ్చిన రావు(ప్రకాష్ రాజ్) అభి చేతిలో అవమానింపబడి మరణిస్తాడు. దాంతో ప్రియ మండిపడి..బ్రేకప్ చెప్పేస్తుంది. అక్కడ నుంచి అభి ఆలోచనలో పడతాడు. అసలు ఎంతో మంచివాడు అనిపించుకున్న అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాక అతని జీవితంలో ఏం జరిగింది…అతని ఆలోచ‌న‌లు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌

విశ్లేషణ:

ఒకే కథను రకరకాలుగా చెప్పచ్చు. అయితే చాలా కథలు character-driven vs. plot-driven అనే పాయింట్ దగ్గర స్టక్ అయ్యిపోతాయి. వారి వారి రైటింగ్ స్టైల్ ని బట్టి అవి ఓ రూపం దాలుస్తాయి. అలా ఈ కథను character-driven గా చెప్దామనుకున్నారు. అందుకు తగ్గ మెటీరియల్ వాళ్ల దగ్గర లేదు. ముఖ్యంగా ఇలాంటి కథలకు ఇంట్రస్టింగ్ క్యారక్టర్, వాటి బ్యాక్ స్టోరీలు అత్యవసరం. అలాగే character arc ప్రధాన భూమిక వహిస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్ లో వన్ సైడ్ కథనం పనికి రాదు. అదే ఈ “థాంక్యూ” కు జరిగింది. కథకు అవసరమైన కాంప్లిక్ట్ రైజ్ చేయకుండా స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్ళారు. inner conflict మీద ఫోకస్ పెట్టి external conflict ని పట్టించుకోలేదు. అలాగే ఓ పాయింటాఫ్ వ్యూని బిల్డ్ చేయలేదు.

‘జీవితంలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎవ్వరూ ఎదగలేరు. సక్సెస్ కాలేరు. మన సక్సెస్ కు కారణమైన వాళ్లను అస్సలు మరిచిపోకూడదు..’ అంటూ మెదలెట్టిన జర్నీలో ఎక్కడా సమస్యలు రాలేదు. దాంతో ఇంట్రస్ట్ అనేది మెల్లిగా పడిపోతూ వచ్చింది. ఎంత ఫీల్ గుడ్ కథ అయినా కాంప్లిక్ట్స్ సరిగ్గా లేకపోతే ఎలా కథ,కథనం డ్రాప్ అయ్యిపోతాయో ఈ సినిమా చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఫస్టాఫ్ మంచి ఎమోషన్స్, సెంటిమెంట్స్ నింపారు. అయితే సోల్ సెర్చింగ్ మిషన్ పై హీరో బయిలుదేరటం చాలా సార్లు చూసేసిందే అనిపించింది. దాంతో ఎక్సైటింగ్ మిస్సైంది. సెకండాఫ్ కు వస్తే….చాలా ప్లాట్ గా కథ సాగింది. క్లైమాక్స్ కాస్తంత ఎమోషన్ గా ఉండటం జస్ట్ ఓకే అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ కథకు అవసరం లేకపోయినా పెట్టారనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పెట్టిన చైతు రాశి ఖన్నా లిప్ లాక్ కిస్సులు అలాంటివే. మాళవిక నాయర్ తో సైతం లవ్ ట్రాక్ లోనూ ఎమోషన్ లేదు.

ప్లస్ లు :

నాగచైతన్యలో పరిణితి చెందిన నటన
మంచి కెమెరా వర్క్
రన్ టైమ్

మైనస్ లు :
రొటీన్ కథ
ప్లాట్ నేరేషన్
సరైన మ్యూజిక్, కథకు తగ్గ మ్యాజిక్ లేకపోవటం

టెక్నికల్ గా ..

దర్శకుడుగా విక్రమ్ కె కుమార్ సినిమా నుంచి ఎక్సెపెక్ట్ చేసే సినిమా అయితే కాదు. స్క్రిప్టు పరంగా చాలా సినిమాలు గుర్తు వస్తాయి. ముఖ్యంగా ప్రేమ‌మ్‌, మజిలి, ఆటోగ్రాఫ్ సినిమాలు పదే పదే జ్ఞాపకం వస్తాయి. పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ …అద్బుతంగా ఉంది. తమన్ సంగీతంలో వచ్చిన పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి….బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. . ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డైలాగులు కొన్ని చోట్ల మెసేజ్ లులాగ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటన విషయానికి వస్తే…. నాగచైతన్యకు ఈ సినిమా ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలెంజింగ్‌ సినిమా. అందరికీ ఇందులో మూడు షేడ్స్ లో ఉన్నట్టు కనిపిస్తాడు. ఇక రాశి ఖన్నా పాత్ర వరల్డ్ ఫేమస్ లవర్ లో ఆమె పాత్రకు ఎక్సటెన్షన్ లాగ అనిపిస్తుంది. మాళవిక నాయక్, అవికా గోర్ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ, పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్రకాశ్‌రాజ్‌, సుశాంత్‌రెడ్డి కీల‌క పాత్రల్లో క‌నిపిస్తారు.

చూడచ్చా?

చూడకపోయినా పెద్ద నష్టమేమీ అనిపించదు. మరీ ఖాళీగా ఉంటే ఓ లుక్కేయచ్చు.

బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ త‌దిత‌రులు
కథ, మాటలు: బి.వి.ఎస్.రవి
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: పి.సి.శ్రీరామ్‌
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌
స‌హ నిర్మాత : హ‌ర్షిత్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ కె.కుమార్‌
Run Time: 2 గం 9 నిమిషాలు
విడుదల తేదీ : 22,జూలై 2022.