దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మీడియా సమావేశం
రెబల్ స్టార్ డా. యు.వి. కృష్ణంరాజు సమర్పణలో గ్లోబల్‌స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీధలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వహరిస్తున్నారు.
జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ భారీ లవ్లీ విజువల్ వండర్ ని ఏకకాలంలో ఐదు భాషలతో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ భారీ రేంజ్‌లో విడుదల చేస్తున్నారు.
మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్, మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జ్యోతష్య శాస్త్రంపై ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేది. ఇది యూనివర్సల్ పాయింట్. దీని బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నప్పుడు చాలా అధ్యయనాలు చేశాను. ఈ కథను ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రెడీ చేసుకున్నా. మొదట మన దేశంలోనే ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్న ప్లేస్‌ను బేస్ చేసుకుని చేద్దాం అనుకున్నా. కానీ ప్రభాస్ గారి సూచన మేరకు యూరప్ బ్యాక్‌డ్రాప్‌గా మారింది. జ్యోతిష్యం అంటే నమ్మకమా? నిజమా? అనే దానికి నేను ఇచ్చిన కంక్లూజన్ సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది. సాహోతో పార్లల్‌గా రాధేశ్యామ్ కొంత సాగింది. అయితే కోవిడ్ ప్రభావంతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవం. మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగానే నాకు, మా కెమెరామెన్‌కు కూడా కోవిడ్ వచ్చింది. దాంతో యూనిట్ అంతా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాం. లాక్‌డౌన్ వల్ల యూరప్ షెడ్యూల్‌ను మధ్యలోనే ఆపేసి.. వేరే దేశాల మీదుగా మొత్తానికి ఇళ్లకు చేరాం. నా సినిమాల్లో హీరోలను క్లాస్‌గానే చూపించాలి అనుకుంటా. కృష్ణంరాజుగారిది ఓ ప్రత్యేకమైన పాత్ర. దానికి ఆయనే కరెక్ట్ అని రేపు ప్రేక్షకులు అంటారు. పూజా హెగ్డే, ప్రభాస్‌లకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్స్ అనుకోవచ్చు. పూజాకు మంచి పెరఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర. పాటలకు వేరే వేరే సంగీత దర్శకులు పనిచేసినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం థమన్ గారు చేయడం సినిమా లెవల్‌ను ఖచ్చితంగా పెంచుతుంది. ఆయనకు నా ఆలోచన, ప్రేక్షకుల పల్స్ బాగా అర్ధమయ్యాయి. యు.వి. క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు నేను దర్శకుడు కావటం నిజంగా లక్కీ. సినిమా ఆలస్యమైన మాట వాస్తవమే. ఎందుకంటే ప్రపంచం మొత్తం కోవిడ్ వల్ల ఇబ్బంది పడిరది. ఆలస్యం అవుతోంది అన్న చిన్న టెన్షన్ తప్ప.. నా మీద ఇంకే విధమైన ప్రెషర్ లేదు. ఎందుకంటే నేను ఏమి తీయాలనుకున్నాను అనే దానిమీద ఫుల్ క్లారిటీగా ఉన్నాను. అదే తీశాను. నా నిర్మాతలు కూడా అదే లైన్ మీద ఉండటం వల్ల నేను టెన్షన్ ఫ్రీ. ఇటువంటి భారీ సినిమాలకు గ్రాఫిక్స్ ప్రాణం. కమల్ కణ్ణన్ గారు దాదాపు 12 దేశాల్లోని టెక్నీషియన్స్‌ను కో ఆర్డినేట్ చేసుకుని విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా శ్రమించారు. మార్చి 1, 2 తారీఖుల నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. బొంబాయిలో, చెన్నైలో రెండు భారీ ప్రమోషన్ ఈవెంట్‌లు ఉంటాయి. ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియా సినిమా చేయడం నా అదృష్టం అన్నారు.