దర్శకుడు రామ్ గణపతి ఇంటర్వ్యూ
రొమాంటిక్ యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్న మా రాజయోగం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది దర్శకుడు రామ్ గణపతి
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్బంగా దర్శకుడు రామ్ గణపతి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ
నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమా తియ్యాలి అనే తపన నాలో ఉండేది.నా చదువైన తర్వాత ఎక్కువగా యానిమేషన్ ఫీల్డ్ లో చాలా సంవత్సరాలు వర్క్ చేశాను. వర్క్ లో బాగంగా ప్యారిస్ లో 9
సంవత్సరాలు ఉన్నాను. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇండియాకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అన్ని ఎమోషన్స్ ఉండేటటు వంటి ఒక మంచి సినిమా తియ్యాలని “ఇఈ” (ఇతడు ఈమె ) అనే సినిమా తీశాను. అప్పుడు పెద్ద సినిమాల మధ్య ఆ సినిమా రిలీజ్ చేయడం వలన ఆ సినిమా పెద్దగా ఆడలేదు.దాంతో నేను 20 సంవత్సరాల నుండి సంపాదించుకుంది అంతా పొగొట్టుకున్నాను. నాకు సినిమా మీద ప్యాషన్ ఉండడంతో నేనేమి బాధ పడలేదు.
పెద్ద సినిమాలు తీస్తే ఆ సినిమాలో నటించే స్టార్స్ కొరకు ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు. అదే చిన్న సినిమా తీస్తే ఆ సినిమాను ఓటిటి లో చూద్దాం అనే విధంగా ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువగా ఓటిటి లో చూడడానికి అలవాటు పడ్డారు. అయితే ప్రేక్షకులు చిన్న సినిమాలు చూడడానికి థియేటర్స్ రావాలి అంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉండాలి. ఆలా ఎదో ఒకటి అట్రాక్ట్ అయ్యే విషయం ఉంటేనే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు. అందుకే ఈసారి యూత్ ని బాగా అట్రాక్ట్ చేసేటటువంటి కమర్షియల్ సినిమా తీయాలని ఫ్రెండ్స్ తో కలసి మంచి రొమాంటిక్ యూత్ ఫుల్ సబ్జెక్ట్ తీశాము. ఇది క్రైమ్ కామెడీ అని కూడా అనుకోవచ్చు. సినిమాలో వచ్చే ఇంటర్వెల్ కు ముందు వచ్చే బ్యాంగ్, క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ & టర్న్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.ఇందులోని క్యారెక్టర్స్ ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఊహించని విధమైన ట్విస్ట్స్ & టర్న్స్ ఈ సినిమాలో ఉంటాయి.
ఇందులో డ్రైవర్ గా పని చేసే హీరో ఓక స్టార్ హోటల్ లో నాలుగు రోజులు ఉండే పరిస్థితి వస్తుంది. అక్కడే తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ నాలుగు రోజుల్లో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా
ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే రాజయోగం అంటే ఒక వజ్రం కోసం జరిగే వేట. ఆ వజ్రం ఎవరికీ దొరికింది ఆ రాజయోగం ఎవరికీ వరించింది అనేదే ఈ సినిమా కథ.
ఈ సినిమాలో అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు.వీరంతా చాలా బాగా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చడమే కాకుండా ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి నెక్స్ట్ షో కు టికెట్ బుక్ చేసుకోమని చెప్పే విధంగా మా రాజయోగం సినిమా ఉంటుంది.
ఈ సినిమా ప్రీమియర్ చూసిన చాలా మంది బాగుందన్నారు. కొంతమంది మొహమాటానికి 10 నిముషాలు చూసి వెళ్తామని చెప్పి సినిమా మొత్తం చూసి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఇలా చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎంకరేజింగ్ గా ఉందని చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా బాగా లేదు అని చెప్పలేదు. చూసిన వారంతా చాలా
హ్యాపీగా ఫీలయ్యారు
ఇందులో హీరోగా నటించిన సాయి రోనక్ చాలా బాగా నటించాడు. తనలో మంచి ఫైటరే కాకుండా మంచి డాన్సర్ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు తన యాక్టింగ్ ను ఎవరూ ఉపయోగించుకోలేదు. అయితే ఈ సినిమాలో తన నటన తోనే కాకుండా డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాడు
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అరుణ మురళీధరన్ కేరళలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.అందులో క్లబ్ లో వచ్చే స్పెషల్ సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటుంది
హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నాము. అయితే ఎవరికి ఈ కథ చెప్పినా ఇందులో ఎక్కువ ముద్దు సీన్స్ ఉన్నాయని చేయడానికి ముందుకు రాలేదు. చివరకు అంకిత సాహా, బిస్మి నాస్ లు ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. ఇందులో రొమాన్స్, ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నా కూడా అశ్లీలంగా ఉండదు. ఫ్రెండ్స్, యూత్,
లవర్స్, భార్య, భర్త ఇలా అందరూ వచ్చి మా సినిమా చక్కగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. చూసిన వారందరికీ మా రాజయోగం సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పగలను అని ముగించారు.