Reading Time: 2 mins

దాడి చిత్రం ప్రారంభ‌o

స‌మాజంలోని చీక‌టి కోణాల‌పై దాడి

వ‌రుణ్ సందేశ్ కీల‌క పాత్ర‌లో ఏ డి.జె.ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  శంక‌ర్ ఆర్ల‌ నిర్మిస్తున్న చిత్రం `దాడి`.  మధు శోభ‌.టి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో జీవ‌న్‌, చెరిష్మా శ్రీక‌ర్‌, కారుణ్య చౌద‌రి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా.. శివాజీ రాజా క్లాప్ కొట్టారు.

ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల‌ స‌మావేశంలో..

హీరో వ‌రుణ్ సందేశ్ మాట్లాడుతూ – “ఏడాది పాటు అమెరికాలో ఉన్నాను. గ్యాప్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇదే. యు.ఎస్ నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను. ఈ క‌థ నాకు బాగా న‌చ్చింది. డైరెక్ట‌ర్ మ‌ధు మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నా గ‌త సినిమాల‌కు భిన్న‌మైన ప్ర‌య‌త్న‌మిది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్య‌క్తిగా ఇందులో క‌న‌ప‌డ‌తాను. ఆ త‌ర్వాత వ‌రుస‌గా జ‌రుగుతున్న అలాంటి ప‌రిణామాలు వెనుక అస‌లు నిజాన్ని రాబ‌ట్టడానికి జ‌ర్న‌లిస్ట్‌గా మారి ఏం చేశాన‌నేదే ఈ క‌థ‌. మ‌ణిశ‌ర్మ‌ సంగీతం సినిమాకు ప్రధాన బ‌లం. ఫిబ్ర‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌కెళ‌తాం“ అన్నారు. 

డైరెక్ట‌ర్ మ‌ధు శోభ‌.టి మాట్లాడుతూ – “అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ ఉండే చిత్ర‌మిది. యూత్‌కు మంచి సందేశం ఉంటుంది. స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిణామాల వెనుకున్న చీక‌టి కోణాల‌ను వెలికి తీసే జ‌ర్న‌లిస్ట్ క‌థ ఇది. క‌చ్చితంగా హిట్ సాధిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు. 

నిర్మాత శంక‌ర్ ఆర్ల‌ మాట్లాడుతూ – “మంచి సందేశం ఉన్న చిత్రం. వ‌రుణ్ సందేశ్‌ త‌న వంతు స‌హకారాన్ని అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడు మ‌ధు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి నిర్మాత‌గా మారాను“ అన్నారు. 

కార్య‌క్ర‌మంలో కార‌ణ్య‌, చెరిష్మాజీవ‌న్‌, శివ‌శంక‌ర్ మాస్టర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డాన్స్‌: శివ‌శంక‌ర్ మాస్టర్‌, సూర్య కిర‌ణ్, ఆర్ట్‌: వెంక‌ట్‌, డైలాగ్స్‌: గుత్తి మల్లిఖార్జున్‌, ఫైట్స్‌: శేఖ‌ర్‌, సంగీతం :మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, కెమెరా: ప్ర‌సాద్ ఈద‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌టేశ్ పుట్ట‌గ‌ళ్ల‌, క్రియేటివ్ హెడ్‌: మోహ‌న్‌, నిర్మాత‌లు: శ‌ంకర్ ఆర్ల‌, డైరెక్ట‌ర్‌: మ‌ధు శోభ‌.టి

Attachments area