ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 రివ్యూ

Published On: June 5, 2021   |   Posted By:

ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 రివ్యూ

రెండు రెట్లు: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ రివ్యూ  

Rating:3/5

సమంత కూడా వెబ్ సీరిస్ మార్కెట్ లోకి వచ్చేసింది. మిగతా హీరోయిన్స్ లా ఓ ప్రక్కన నిలబడుతుందా లేక క్లిక్ అవుతుందా గత కొంతకాలంగా ఇదే చర్చ. అయితే ఈ లోగా ఈ సీరిస్ తేడా కొడితే సమంత కెరీర్ కు పెద్ద దెబ్బ అనే టాక్ మొదలైంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజైననాటి నుంచి ఈ సీరిస్ లో సమంత చేసిన రాజీ పాత్ర వివాదాల్లో ఇరుక్కుని ఉంది. ఆమె తమిళ ఈలం (ఎల్టీటీఈ) సభ్యురాలి పాత్రను పోషించగా.. ఎల్టీటీఈ, పాకిస్థాన్ ఉగ్రవాదాలు కలిసి పని చేసినట్లుగా ట్రైలర్లో చూపించడంపై తమిళనాడు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంతోనే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను నిషేధించాలంటూ డిమాండ్లు చేశారు. ఈ నేపధ్యంలో విడుదలైన  ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఎలా ఉంది…అసలు నిజంగానే వివాదాస్పద అంశాలు ఉన్నాయా..అసలు కథేంటి, మెదటి సీజన్ తరహాలో సక్సెస్ సాధిస్తుందా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ

మొదటి పార్ట్ లో కనపడ్డ  శ్రీకాంత్ తివారి(మనోజ్ బాజ్ పేయి)  తన అండర్ కవర్ జాబ్ ని  వదిలేసి,ఓ సాప్ట్ వేర్ కంపెనీలో  పని చేస్తూంటాడు. భార్య సుచిత్ర (ప్రియమణికి) సేవలో తరిస్తూంటాడు. తన కూతురు, కొడుకు తన వినటం లేదని ఆవేదనపడిపోతూంటాడు. తిరిగి తన వృత్తిలోకి వెళ్లిపోవాలని అనిపించేలా జీవితం సాగుతూంటుంది. అటువంటి టైమ్ లో తన సహచరుడు ద్వారా  ఓ వార్త తెలుస్తోంది. మన దేశ ప్రధానిని ..ఎల్ టీటి ఐ చీఫ్ బాస్కరన్ అంతమొందించటానికి ప్లాన్ చేసారని తెలుస్తుంది. అందుకు రాజీ(సమంత)అనే ఓ అమ్మాయి సీన్ లోకి దిగిందని, ఆమె ఓ స్లీపర్ సెల్ అని, సూసైడ్ బాంబర్ అనే వార్త తెలుస్తుంది. రంగంలోకి దిగిన శ్రీకాంత్ తివారికి అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా రాజీ బ్యాక్ గ్రౌండ్ కూపీ లాగుతాడు. అలాగే ప్రధానికి, భాస్కరన్ కు మధ్య వివాదం ఏంటో రివీల్ అవుతుంది. అవేమిటి..అసలు రాజీ ఎవరు..ఆమెను శ్రీకాంత్ తివారి ఆపగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే ఈ సెకండ్ సీరిస్ చూడాల్సిందే.ఇష్టమైనట్టు ఉండేలా బిహేవ్ చేస్తూ ఆ ప్రాసెస్ లో నలిగిపోతూంటాడు. ఇంట్లో పెళ్లాంతో గొడవలు,పిల్లలతో ఎడ్జెస్ట్ కాలేనితనం  అతనికి చాలా  విసుగ్గా  

ఎనాలసిస్…

ఇదేమీ కొత్త కథకాదు. రాజీవ్ గాంధీ హత్య,అందుకు కారణాలు, ఆయనపై ఎటాక్ చేసిన వారి విషయాలు తెలిస్తే క్లారిటీగా అర్దమైపోతుంది. అయితే అలాంటి తెలుసున్న కథను..ఎంతోమంది ఎమోషన్స్ తో లింక్ ఉన్న కథను ఎంచుకోవవటం దర్శక,,నిర్మాతలు చేసిన తెలివైన పని,సాహసం. అక్కడే వారి సక్సెస్ అయ్యారు కూడా. చాలా తెలివిగా వివాదంలోకి విషయాన్ని వెళ్లకుండా ప్రక్కకు లాగారు. ఎల్ టిటీఐ, ఐఎస్ ఐ ముడిపెట్టారు.రాజీ పాత్రపై సానుభూతి ,సహాయానుభూతి వచ్చేలా చేసారు. అందమైన సమంతను ఎలా అలాంటి పాత్రలో చూపెడతారు అన్నవారికి విజువల్ గా సమాధానం చెప్పారు. రాజీ పాత్ర డిజైన్ లోనే వారి స్క్రిప్టు నాలెడ్జ్జ్ బయిటకు వచ్చింది. అయితే అదే  సమయంలో ఆ పాత్రలో డైమన్షన్స్ మిస్సయ్యాయి.  పాత్రను పాత్రోచితంగా మార్చే క్రమంలో సమంత కష్టం కూడా బాగా కనపడింది. ఆమె మొహంలో ఎక్కడా స్మైల్ అనేదే లేకుండా ఓ మిస్సైల్ లా ఆమెను తీర్చిదిద్దారు. ఓ టైమ్ లో ఆమె పాత్ర కంగారుపుట్టిస్తుంది. మరోసారి జాలి పుడుతుంది. ఇక మనోజ్ బాజ్ పాయి పాత్ర ఫస్ట్ పార్ట్ కు కంటిన్యూషన్. కథలో థ్రిల్స్..మూడు ఎపిసోడ్స్ అయ్యేదాకా మొదలు కాలేదు. కానీ ఒకసారి మొదలయ్యాక..ఆగలేదు. వాస్తవానికి ఈ సిరీస్‌లో తమిళ టైగర్లను నెగెటివ్ కోణంలో ఏమీ చూపించలేదు. లోతుగా కాకపోయినా వాళ్ల బాధల్ని, కష్టాల్ని చర్చించే ప్రయత్నం జరిగింది. వారి కోణంలో కథను చెప్పే ప్రయత్నమూ జరిగింది.

నటీనటులు, మిగతాడిపార్టమెంట్స్..

సమంత,మనోజ్ బాజ్ పేయి ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. సమంత అయితే డామినేట్ చేసేసింది. టెర్రరిస్ట్ గా సమంత ఎలా ఉంటుందో అని  ఎదురుచూసినవారికి ఆశ్చర్యపరిచే ఫెరఫెర్మెన్స్ ఇచ్చింది.  ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఊహాత్మక కథ అని చెబుతున్నప్పటికీ.. ఇందులో చూపించింది ఎల్టీటీఈ గురించే అనేది సుస్పష్టం. సమంత అందులో సభ్యురాలిగానే కనిపించింది. ఇక మిగతా డిపార్టమెంట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్,సినమాటోగ్రఫీ హైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ అదరకొట్టారు.

చూడచ్చా

ఖచ్చితంగా చూడదగ్గదే..సమంత ఫెరఫార్మెన్స్ కోసమన్నా చూడచ్చు

ఎవరెవరు..

బ్యానర్: డీ2ఆర్ ఫిల్మ్స్
నటీనటులు: మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి, సమంత అక్కినేని, శరద్ కేల్కర్ తదితరులు
నిర్మాత, కథ, దర్శకత్వం: రాజ్ నిడిమోరు అండ్ కృష్ణ డీకే
మ్యూజిక్: కేతన్ సోదా
రీరికార్డింగ్: జాన్ నిస్సార్ లోన్, కేతన్ సోదా
సినిమాటోగ్రఫి: అజిమ్ మూలన్, నిగమ్ బోంజాన్
ఎడిటర్: సుమీత్ కోటియాన్
ఓటీటి: అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ: 04,జూన్ 2021