Reading Time: 2 mins
ది వారియర్ సినిమా రామ్ ఫస్ట్ లుక్ విడుదల
Image

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ టైటిల్ ఖరారు చేశారు. రామ్ 19వ చిత్రమిది. సోమవారం టైటిల్ రివీల్ చేయడంతో పాటు రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

రామ్ – లింగుస్వామి కాంబినేషన్ తొలిసారి రామ్ స్ట్రయిట్ తమిళ సినిమా.దర్శకుడు లింగుస్వామి తెలుగు సినిమా చేస్తుండటం సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. అప్పటి నుంచి సినిమా కథ ఏమై ఉంటుంది? టైటిల్ ఏం పెడతారు? అనే ఆసక్తి పెరిగింది. రామ్ క్యారెక్టర్, కథ గురించి ఈరోజు దర్శకుడు లింగుస్వామి క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ చూస్తే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌ను దర్శకుడు లింగుస్వామి చూపించారు. చేతిలో గన్, టెర్రిఫిక్ ఎక్స్‌ప్రెష‌న్‌, చుట్టూ పోలీసులు టఫ్ లుక్‌లో రామ్ సూపర్ అని ప్రేక్షకులు అంటున్నారు. తొలిసారి ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. అదీ లింగుస్వామి దర్శకత్వంలో కావడం,ఇప్పుడీ లుక్, టైటిల్ సినిమాపై‌ అంచనాలను మరింత పెంచాయి.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… “రామ్ లుక్, టైటిల్ పోస్టర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. అందరిలో‌ అంచనాలు పెరిగాయి. వాటికి మించి సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేలా కథ – కథనం పరుగులు పెట్టిస్తూ సినిమాలు తీయడం లింగుస్వామి స్టైల్. ‘ది వారియర్’ను అలాగే‌ తీస్తున్నారు. ‘రన్’, ‘పందెం కోడి’, ‘ఆవారా’ చిత్రాలను మించిన స్థాయిలో ఈ చిత్రాన్ని లింగస్వామి తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాం. ప్రస్తుతం కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు, భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అన్నారు.

రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.