Reading Time: 3 mins

ద‌ర్శ‌కుడు వై యుగంధ‌ర్ ఇంట‌ర్వ్యూ

పిల్లలతో పాటు పేరెంట్స్ కి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం  ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ – డైరెక్టర్ వై.యుగంధర్

చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా  రూపొందుతోన్న చిత్రం  `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా  చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. ఆగ‌స్ట్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా, ద‌ర్శ‌క‌కుడు వై.యుగంధ‌ర్ ఇంట‌ర్వ్యూ…

నేప‌థ్యమేంటి?

– ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి సినిమా. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశాను. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా కూడా ప‌నిచేశాను. మాది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ల‌క్ష్మీపురం ద‌గ్గ‌ర దేవ‌ప‌ల్లి అనే గ్రామం. సినిమాలంటే చిన్న‌ప్ప‌ట్నుంచి ఉన్న ఆస‌క్తితో నా జ‌ర్నీని స్టార్ట్ చేశాను. ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన త‌ర్వాత దాసు, ఒరేయ్ త‌మ్ముడు, పృథ్వీనారాయ‌ణ‌, ఒట్టేసి చెబుతున్నా, రాధాగోపాలం, రామ్‌, అల్ల‌రి బుల్లోడు చిత్రాల‌కు ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అయితే ద‌ర్శ‌కుడు కావాల‌నేదే నా ఆలోచ‌న‌గా ఉండేది. అయితే కెరీర్‌ను అన్ని డిపార్ట్‌మెంట్స్‌ను హ్యాండిల్ చేసే ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా వ‌ర్క్ చేయాల్సి వ‌చ్చింది. సినిమాల్లోకి రావ‌డం ముఖ్యం కావ‌డంతో ఆ ప‌నిని కూడా ప్రేమ‌తో, ఇష్టం, బాధ్య‌త‌తో స్టార్ట్ చేశాను. అలా ప‌నిచేసే క్ర‌మంలో అన్ని డిపార్ట్‌మెంట్స్ గురించి తెలుసుకున్నాను. బాపుగారంటే గౌర‌వం..ఆయ‌న రాధాగోపాలం సినిమాకు ప‌నిచేసేట‌ప్పుడు ఆయ‌న‌కు అసిస్టెంట్‌లా ఉండి డైరెక్ష‌న్ గురించి నేర్చుకున్నాను. అలాగే వాసుగారి ద‌గ్గ‌ర కూడా డైరెక్ష‌న్ గురించి నేర్చుకున్నాను. వ‌ర్క్ చేయ‌కుండా చూసే ద‌ర్శ‌క‌త్వం గురించి అవ‌గాహ‌న పెంచుకున్నాను.

‘ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు’ క‌థ ఎప్పుడు రాసుకున్నారు?


– క‌రోనా వేవ్ కంటే ముందే ఈ క‌థ‌ను రాసుకున్నాను. క‌రోనా వేవ్ ఫ‌స్ట్ వేవ్‌లోనే చిత్రీక‌ర‌ణ ముగిసింది. రీరికార్డింగ్ పూర్తి చేసేట‌ప్ప‌టికీ సెకండ్ వేవ్ ప్రారంభ‌మైంది. లేకుంటే ఎప్పుడో ‘ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు’ రిలీజై ఉండేది. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ నుంచి డైరెక్ట‌ర్ అయిన నేను.. డైరెక్ట‌ర్‌గా జ‌ర్నీ స్టార్ట్ చేసిన త‌ర్వాత కూడా క‌థ‌ను త‌యారు చేసుకోవ‌డం నుంచి .. సినిమా ముగించే వ‌ర‌కు ఓ డైరెక్ట‌ర్ ఎలాంటి ఇబ్బందులు ప‌డుతాడో, ఆ ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాను. డైరెక్ష‌న్ చేయాల‌నుకున్న త‌ర్వాత ఓ క‌థ‌ను అనుకుని జ‌ర్నీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయ‌డానికి మూడున్న‌రేళ్లు ప‌ట్టింది. ఇండ‌స్ట్రీ ప‌ర్స‌న్ కావ‌డంతో నాకు ఆ బాధ‌లు తెలుసు కాబ‌ట్టి, వెయిట్ చేశాను. సోలో ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా నా చివ‌రి చిత్రం.  ‘ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు’ ను డైరెక్ట్ చేయ‌డం కంటే ముందే స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి క‌థ‌లు త‌యారు చేసుకున్నా కూడా ఆవేవీ మెటీరియ‌లైజ్ కాలేదు. ఆ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడిగా న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవ‌డానికి ‘ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు’ క‌థ‌ను కొత్త వాళ్ల‌తో చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాను.

టైటిల్ జ‌స్టిఫికేష‌నేంటి?


– ఎప్పుడు చేయాల్సిన ప‌నిని అప్పుడే చేయాలి. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు? అని తొంద‌ర‌ప‌డి చేసే ప‌నులు స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయ‌నే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో ఈ టైటిల్‌ను పెట్టాం. క‌థ‌కు త‌గ్గ టైటిల్‌. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. అలాగే మంచి మెసేజ్ కూడా సినిమాలో ఉంటుంది. అదేంట‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. త‌ల్లిదండ్రుల‌కు, పిల్ల‌ల‌కు మ‌ధ్య ఉండే ఓ సెన్సిటివ్ అంశాన్ని ఎలివేట్ చేసేలా సినిమాను తీశాను.

సినిమా ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత కాంట్రవ‌ర్సీ కావ‌డంపై మీరేమంటారు?  సినిమా బోల్డ్‌గా ఉంటుందా?


–  సినిమా అంతా బోల్డ్‌గా తీయ‌లేదు. ఓ సీక్వెన్స్ మాత్రం అలా ఉంటుందంతే. ఆ సీక్వెన్స్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అటెంప్ట్ చేయ‌లేద‌ని నేను కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను. అది ఎరోటిక్‌గా ఉంటుంది. ఆ సీన్స్ వ‌ల్ల సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ భావించారు. కానీ.. సినిమా మ‌రో కోణంలో సాగుతుంది. అలాగే టీజ‌ర్ విడుద‌ల త‌ర్వాత కొన్ని కాంట్ర‌వ‌ర్సీలు ఎదుర్కోవాల్సి వ‌చ్చాయి. ఆ స‌మ‌స్య‌లు ఇప్పుడు క్లియ‌ర్ అయ్యాయ‌నే అనుకుంటున్నాం. నేను ఏదీ కావాల‌ని చేయ‌లేదు. టైటిల్ సాంగ్‌లో భ‌జ గోవిందం అనే లైన్స్ ఉంటాయి. సాంగ్ రిలీజ్ అయిన‌ప్పుడు ఎవ‌రికీ ఇబ్బందిగా అనిపించ‌లేదు. ట్రైల‌ర్ విడుద‌ల స‌మ‌యంలో టైటిల్ సాంగ్‌ను ట్రైల‌ర్‌లో ఉప‌యోగించాను. అయితే విజువ‌ల్స్, భ‌జ గోవిందం అనే లైన్స్ రాంగ్ టైమింగ్‌లో క‌నిపించ‌డం అనేది కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. అది నేను గ‌మ‌నించ‌క‌పోవ‌డం అనేది నా త‌ప్పు.. ద‌ర్శ‌కుడిగా అనుభ‌వం లేక‌పోవ‌డ‌మే దానికి కార‌ణం కావ‌చ్చు.

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం ద‌ర్శ‌క‌త్వ చేయ‌డంలో ఎంత వ‌ర‌కు ప‌నికొచ్చింది?


– ప్రొడక్ష‌న్ మేనేజ‌ర్‌గా చేసిన ఎక్స్‌పీరియెన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న‌ప్పుడు బాగానే ఉప‌యోగ‌ప‌డింది. అయితే ఓ విష‌యంలో ఫెయిల్ అయ్యాను. అదే బ‌డ్జెట్ విష‌యం. గోవాకు వెళ్లిన‌ప్పుడు రెండో రోజునే హీరోయిన్‌కు యాక్సిడెంట్ జ‌రిగింది. దాని వ‌ల్ల అక్క‌డ షూటింగ్ చేయ‌లేక‌పోయాం. డ‌బ్బులు కూడా మొత్తంగా చెల్లించాల్సి వ‌చ్చింది. అలా బ‌డ్జెట్‌లో 30-40 ల‌క్ష‌ల రూపాయ‌లు అనుకున్న దానికంటే ఎక్కువ‌గానే క్రాస్ అయ్యింది. మిగ‌తాదంతా అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది.

నిర్మాత నుంచి స‌పోర్ట్ ఎలా ఉండింది?


– ఈ సినిమా విష‌యంలో నాకున్న ధైర్య‌మే నా నిర్మాత చింతా గోపాలకృష్ణగారే. చాలా పెద్ద పారిశ్రామిక వేత్త‌. సినిమా అంటే ఉండే ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌తి సంవ‌త్స‌రం రెండు, మూడు సినిమాలు చేయాల‌నే వ‌చ్చారు.

హీరో, హీరోయిన్ గురించి…?


– హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్ ఇద్ద‌రూ కొత్త‌వాళ్లే. అమ్మాయిది ముంబై. డాక్ట‌ర్ చ‌దువుకుంది. అబ్బాయి ఇక్క‌డివాడే. చ‌క్క‌గా చేశారు.

త‌దుప‌రి చిత్రాలు?


– డిస్క‌ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. ఆరు జోనర్స్‌కు సంబంధించిన ఆరు క‌థ‌లున్నాయి. `ఇప్పుడు కాక ఇంకెప్పుడు` రిలీజ్ త‌ర్వాత నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తాం. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు డైరెక్ట‌ర్ వై.యుగంధ‌ర్‌.