Reading Time: < 1 min

నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమా చివ‌రి షెడ్యూల్లో

చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో సందీప్‌కిష‌న్ నిను వీడ‌ని నీడ‌ను నేనే

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి విప‌త్క‌ర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమా చూడాల్సిందే అంటున్నారు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్‌. ఈ హీరో న‌టిస్తోన్న ఎమోష‌న‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని క‌థాంశంతో రాబోతున్న చిత్ర‌మిది.
వెంక‌టాద్రి టాకీస్‌,  విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ప‌తాకాల‌పై కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాత‌లుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే`.  ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

ఈ సంద‌ర్భంగా …
ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ – “ఒక కొత్త పాయింట్ తీసుకుని ఎమోష‌న‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిష‌న్ తొలిసారి న‌టిస్తోన్న హార‌ర్ చిత్ర‌మిది. మ‌నిషి శత్రువుతో యుద్ధం చేస్తాడు కానీ.. మ‌నిషి త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే పాయింట్‌.  ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్‌ను హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నారు. హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నారు దీంతో సినిమా పూర్తవుతుంది“ అన్నారు.

నిర్మాత ద‌యా ప‌న్నెం మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడు కార్తీక్ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌అన్య సింగ్పోసాని కృష్ణ ముర‌ళిముర‌ళీ శ‌ర్మ‌వెన్నెల‌కిషోర్‌రాహుల్ రామ‌కృష్ణ‌పూర్ణిమ భాగ్య‌రాజ్‌ప్ర‌గ‌తి
సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌లు: ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌. ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ రాజు.  సినిమాటోగ్ర‌ఫీ:
ప్ర‌మోద్ వ‌ర్మ‌  సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్ర‌వీణ్‌. ఆర్ట్‌:  విదేశ్‌