నెల్లూరి పెద్దారెడ్డి చిత్రం ఊర్వశి ఓటిటి విడుదల

Published On: May 14, 2021   |   Posted By:
నెల్లూరి పెద్దారెడ్డి చిత్రం ఊర్వశి ఓటిటి విడుదల
 
నిఖార్సయిన వినోదం పంచే నెల్లూరి పెద్దారెడ్డి ఊర్వశి ఓటిటి విడుదల
 
సిద్ధి విఘ్నేశ్వర క్రియేషన్స్ పతాకంపై సతీష్ రెడ్డి టైటిల్ పాత్రలో.. వి.జె.రెడ్డి దర్శకత్వంలో సి.హెచ్.రఘునాథ్ రెడ్డి నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’.      
 
మౌర్యాని, ముంతాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ శ్రీను, అంబటి శ్రీను, లక్ష్మీ, సుజాత, బేబీ దివ్య ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
 
కడుపుబ్బ నవ్వించే కామెడీతో రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ఈనెల 21 నుంచి ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
 
ప్రముఖ రచయిత-దర్శకుడు పోలూరు ఘటికాచాలం ఈ చిత్రానికి కథ-మాటలు- పాటలు-స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
     
సిద్ధి విఘ్నేశ్వర క్రియేషన్స్ అధినేత సి.హెచ్.రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. “నెల్లూరి పెద్దారెడ్డి” అనగానే అందరికీ టక్కున బ్రహ్మానందం గుర్తుకొచ్చి పెదాలపై నవ్వులు పూస్తాయి. ‘నెల్లూరి పెద్దారెడ్డి’ పేరుతో మేం తెరకెక్కించిన చిత్రంలోనూ వినోదం పుష్కలంగా ఉంటుంది. ఈనెల 21 నుంచి ఊర్వశి ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఈసందర్భంగా ‘ఊర్వశి’ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం” అని అన్నారు.     
 
ఈ చిత్రానికి పోరాటాలు: రవి, కూర్పు: శ్రీను, సంగీతం: గురురాజ్, ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం, కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే: పోలూరు ఘటికాచాలం, నిర్మాత: సి.హెచ్.రఘునాథ్ రెడ్డి, రచన-దర్శకత్వం: వి.జె.రెడ్డి, విడుదల: ఊర్వశి ఓటిటి.