Reading Time: 4 mins

నేను స్టూడెంట్ సర్ మూవీ రివ్యూ

నేను స్టూడెంట్ సర్’ రివ్యూ..ప్లస్ లు, మైనస్ లు, రేటింగ్

Emotional Engagement Emoji

?

‘స్వాతి ముత్యం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు బెల్లంకొండ గణేశ్ ఇంతకుముందే వచ్చిన. మన ప్రక్కింటి కుర్రాడిలా అనిపించాడు ఆ కథలో…ఓకే తెలుగుకుమంచి హీరో దొరికాడు అనుకున్నారు.   అమాయకత్వానికి మనం పెట్టుకున్న పేరే మంచితనం అన్నట్టుగా ఆ సినిమాలోని పాత్రకి ఆయన కరెక్టుగా సెట్ అయ్యాడు. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా . ఆ తరువాత సినిమాగా ఆయన చేసినదే ‘నేను స్టూడెంట్ సర్’. ఆ సినిమాకు పెద్దగా వర్కవుట్ కావటం లేదు..ఎందుకుని..అసలు చిత్రం కథేంటి…ఎక్కడ సినిమా దెబ్బతిందో చూద్దాం…

స్టోరీ లైన్

యూనివ‌ర్సిటీ స్టూడెంట్‌.  సుబ్బు (బెల్లంకొండ గ‌ణేష్‌) కి ఐ ఫోన్ అంటే ప్రాణం. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు అయిన సుబ్బు నానా కష్టాలు పడి ఓ ఐ ఫోన్ కొనుక్కుంటాడు. దానికి ఓ పేరు పెట్టుకుని సొంత బ్రదర్ లా చూసుకుందామనుకుంటాడు.  కానీ ఫోన్ కొన్న మొదటి రోజే… అనుకోకుండా జ‌రిగిన‌ ఓ గొడ‌వ మీద పోలీస్ స్టేష‌న్ కి వెళ్లటం… అక్క‌డ ఫోన్ పోవటం జరుగుతుంది. పోలీసులే త‌న ఫోన్ దొంగిలించార‌న్న‌ది సుబ్బు అభియోగం. దాంతో  పోలీసుల‌పై నింద వేసే స‌రికి.. క‌మీష‌న‌న్ అర్జున్ వాసుదేవ్ (స‌ముద్ర‌ఖ‌ని) మండిప‌డ‌తాడు. ‘నీ ఫోన్ దొరికినా నీకు ఇవ్వ‌ను… ‘ అని వార్నింగ్ ఇస్తాడు.  ఈగోకి వెళ్లిపోతాడు. సుబ్బు తక్కువ కాదు…ఎలాగైనా స‌రే… ఫోన్ ద‌క్కించుకొంటాన‌ని శ‌ప‌థం చేస్తాడు. ఆ త‌ర‌వాత ఏమైంది? ఆ ఫోన్ వ‌ల్ల సుబ్బు జీవితం ఎన్ని మ‌లుపులు తిరిగింది? అనేదే క‌థ‌.

ఎనాలసిస్ …

కొత్త దర్శకులు  సినిమాలు తీసేటప్పుడు కొత్త పాయింట్లతో వస్తున్నామని పాత పాయింట్లకే కొత్త పూత పూస్తూంటారు. మరికొందరు డైరక్టర్స్..ఏదో వింత పాయింట్ ని పట్టుకుని దానికి బిగిన్,మిడిల్,ఎండ్ లేకుండా తీసి..ఇదే కొత్తదనం చూసుకోండి పొండి అని మీదకు కొడుతున్నారు. ఈ దర్శకుడు రెండో తెగకు చెందిన వాడు అనిపిస్తుంది. తాను ఎంచుకున్న చిన్న పాయింట్ ని పూర్తి స్దాయిలో విస్తరించకుండా , జనాలు చూడగలిగే ఫార్మెట్ లో పెట్టకుండా ఎక్కడా టైమ్ అండ్ టెన్షన్ లేకుండా తీసేసాడు. అయితే అది సినిమా కాదా అంటే వినటానికి సినిమా కావచ్చు కానీ చూడటానికి కష్టం అనిపిస్తుంది. అందులోనూ మార్కెట్లో సేలబులటి ఉన్న  హీరో కూడా కాదు. ఇంకాస్త జాగ్రత్త పడి రాసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా డైరక్టర్ అక్కడితోనే కాంప్రమైజ్ అయ్యిపోయాడు.

సినిమా లో హీరో తన ‘ఐ ఫోన్’ ను పోలీసులే కాజేశారనీ .. అది పోలీస్ కమిషనర్ దగ్గరే ఉందని హీరో భావించడం, ఆయన రివాల్వర్ ను సంపాదించి తన ఫోన్ తనకి ఇస్తేనే ఆ రివాల్వర్ ఇస్తానని బెదిరించడం.. కొన్ని రోజుల పరిచయానికే అడగ్గానే హీరోకి పోలీస్ కమిషనర్ కూతురే ఆ రివాల్వర్ ఇచ్చేయడం ఇక్కడ అతకని విషయం .. అర్థం లేని అంశం అని మనకు అర్దమవుతుంది. డైరక్టర్ కు ఎందుకు అర్దం కాలేదో అనిపిస్తుంది.  పోనీ ఆ ఫోన్ లో ఏదైనా సీక్రెట్ ఉందా అంటే అదీ లేదు .. నిజంగానే ఆ ఫోన్ కమిషనర్ తీశాడా అంటే తీయలేదు. ఇవన్నీ కాదండీ…ఈ ఫోన్ దొంగతనం  వెనుక వేరేవారి కుట్ర కోణం ఏదైనా ఉందా అంటే లేదు. వేరే రూట్లో జరుగుతున్న మాఫియాకి .. ఈ ఫోన్ కి ఎలాంటి సంబంధం లేదు. పోనీ కథలో బలమైనవిలన్ ఉన్నాడా అంటే లేడు. ‘జబర్దస్త్’ రామ్ ప్రసాద్ విలన్ అంటే ఎలా ఒఫ్పుకుంటాము.   అలాగే స్క్రీన్ ప్లే విష‌యంలో ద‌ర్శ‌కుడు ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకొని, అన్ ఆర్థ‌రైజ్డ్ బ్యాంక్ ఎకౌంట్స్ అనే పాయింట్ పై క‌స‌ర‌త్తు చేసి, సెల్ ఫోన్‌కీ, ఈ బ్యాంక్ స్కామ్‌కీ స‌రైన లింకు పెట్టుకొంటే – క‌చ్చితంగా ఈ సినిమా ఓ స్థాయిలో నిలిచేది.

టెక్నికల్ గా ..

బెల్లంకొండ గ‌ణేష్‌ లుక్స్ కు పెద్దగా లేకుండా ఫెరఫార్మెన్స్ పరంగా బాగానే చేసాడు. ఆ సినిమాలో పాత్ర‌కు, టైటిల్ కు త‌గిన న‌ట‌న క‌న‌బ‌రిచాడు.  అవంతిక మిస్ మ్యాచ్ అయ్యింది. స‌ముద్ర‌ఖ‌ని.. వలన సినిమాకు ఓ లుక్ వచ్చింది. మిగతా పాత్రలు జస్ట్ ఓకే.

టెక్నికల్ గా …

ద‌ర్శ‌కుడు రాఖీ ఉప్ప‌ల‌పాటికి మొదటి సినిమాకు ఇంకాస్త కష్టపడాలి అనుకోలేదు. స్క్రిప్టు దగ్గర రాజీ పడిపోయాడు.  అయితే క్వాలిటీ మేకింగ్ ఉంది.   పాట‌ల‌కు అవకాసం లేదు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.స్క్రీన్ ప్లే లోపాలు సినిమాని దెబ్బ తీసాయి. ఎడిటింగ్ , కెమెరా వర్క్ నాణ్యతగా కాదు కానీ ఓకే అనిపించాయి. డైలాగులు కూడా జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త బాగుంటే బాగుండేది.

బాగున్నవి:

?సినిమా ప్రారంభం ఎత్తుగడ
?హీరో ఫెరఫార్మెన్స్

బాగోలేనివి:

?ప్రెడిక్టబుల్ గా మారిన కథ
?అర్దపర్దం లేని నేరేషన్
?విసుగెత్తించే ముగింపు
?స్క్రీన్ ప్లే

చూడచ్చా

ఓటిటిలో ఓ సారి ఓ లుక్కేయవచ్చు..అంతకు మించి థియేటర్ కు పరుగెత్తుకెళ్లి చూడాల్సిన సినిమాలా అనిపించదు.

నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాం ప్రసాద్, చరణ్ దీప్, ప్రమోదిని, రవి శివతేజ తదితరులు
కథ: కృష్ణ చైతన్య
సంగీతం: మహతి స్వర సాగర్
కెమెరా: అనిత్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
నిర్మాత: సతీష్ వర్మ
దర్శకత్వం: రాఖి ఉప్పలపాటి
Running time: 2h 2m
విడుదల: జూన్ 2, 2023