పరాన్నజీవి చిత్రం జూలై 25న శ్రేయాస్ ఈటీ ఓటీటీ యాప్‌లో రిలీజ్
స్వార్థ, స్వప్రయోజనాలపై సంధించిన సినీ విమర్శనాస్త్రం పరాన్నజీవి
ఇతరుల వ్యక్తిత జీవితాలను కించపరుస్తూ, తన స్వార్ధపూరిత స్వప్రయోజనాలకు అర్థం పర్ధంలేని సినిమాలు తీస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీపై తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న చిత్రం పవర్‌స్టార్. పవన్ కల్యాణ్ ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత, ప్రొఫెషన్ జీవితంపై సినీ విమర్శనాస్త్రంగా పవన్ ఫ్యాన్స్ రూపొందిస్తున్న చిత్రం పరాన్నజీవి Reckless Genetic Virus ఉపశీర్షిక.
పవన్ అభిమానుల ఆలోచనలకు, ఆశాయాలకు అనుగుణంగా తెరకెక్కుతూ వర్మ లైఫ్‌పై సెటైరికల్ మూవీగా రూపొందుతున్న పరాన్నజీవి శరవేగంగా షూటింగు జరుపుకోబోతున్నది. ఈ చిత్రాన్ని 99 థియేటర్ బ్యానర్‌పై స్కైమీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి నిర్మాత: సీఎస్. దర్శకుడు: డాక్టర్ నూతన్ నాయుడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. మంగళవారం (జూలై 21న) షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జూలై 20న రిలీజ్ చేశారు.
ఇందులోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు.. ఒకరిని కించపరిచే విధంగా, నొప్పించే విధంగా చేయడం లేదు. స్వప్రయోజనాల కోసం, విలువలను తుంగలో తొక్కుతూ డబ్బు సంపాదించడం, కొన్ని విషయాలను వివాదాస్పదం చేయడం లక్ష్యంగా చేసుకొన్న వారిపై ఈ సినిమాను సినీ విమర్శనాస్త్రంగా సంధిస్తున్నాం అని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తమ సాంకేతిక విలువలతో రూపొందబోతున్న పరాన్నజీవి చిత్రాన్ని జూలై 25వ తేదీన 11 గంటలకు శ్రేయాస్ ఈటీ ఓటీటీ యాప్‌లో రిలీజ్ చేస్తామన్ని పేర్కొన్నారు.