పార్ట్‌నర్ మూవీ ఆగస్టు 25 విడుదల
ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని, ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పార్ట్‌నర్ ఆగస్టు 25న విడుదల
ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పార్ట్‌నర్. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా బి.జి.గోవింద్ రాజు సమర్పణలో తెలుగు, తమిళ్ ఏకకాలంలో ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.
హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన పార్ట్‌నర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ మీరు నవ్వడానికి రెడీనా ? అన్నారు ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకర్స్.
ఈ చిత్రంలో యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. పల్లక్ లాల్వానీ, పాండిరాజన్, రోబో శంకర్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంతోష్ ధయానిధి సంగీతం అందిస్తుండగా, షబీర్ అహమ్మద్ సినిమాటోగ్రఫర్. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్.
తారాగణం :
ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని, యోగి బాబు, పల్లక్ లాల్వానీ, పాండిరాజన్, రోబో శంకర్ , జాన్ విజయ్, రవి మరియ, టైగర్ తంగదురై
టెక్నికల్ టీమ్ :
దర్శకత్వం : మనోజ్ ధమోధరన్
ప్రొడక్షన్ హౌస్ : ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: బి.జి.గోవింద్ రాజు
నిర్మాత: M.S. మురళీధర్ రెడ్డి
సంగీతం: సంతోష్ ధయానిధి
సినిమాటోగ్రఫీ: షబీర్ అహమ్మద్
ఎడిటర్ : ప్రదీప్ E రాఘవ్