పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Published On: September 28, 2017   |   Posted By:

పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

టాలీవుడ్ సినిమాకు పరుగు నేర్పించిన దర్శకుడు. ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా సినిమాను ఫాస్ట్ గా తీయడం ఎలాగో నేర్పించిన డైరక్టర్. హీరోయిజంకు కొత్త డెఫినిషన్ ఇచ్చిన మేకర్. అతడే పూరి జగన్నాథ్. టాలీవుడ్ స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈరోజు (28-09-2017) తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, మొదటి సినిమాతోనే తన మేకింగ్ స్టయిల్ ఏంటో చూపించాడు. దర్శకుడిగా తన పంథా ఏంటో కూడా రుచిచూపించాడు. ఆ సినిమా నుంచి మినిమం గ్యాప్ లో సూపర్ హిట్స్ ఇస్తూనే ఉన్నాడు పూరి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత.. ఇలా చెప్పుకుంటూ పోతే పూరి కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి.

రవితేజను ఫుల్ లెంగ్త్ హీరోగా మార్చింది, రామ్ చరణ్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేసింది కూడా పూరి జగన్నాథే. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు పూరి. ప్రస్తుతం పూరి కనెక్ట్స్ అనే సంస్థను స్థాపించి ఆ కంపెనీ ద్వారా నూతన నటీనటుల్ని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న ఈ సెన్సేషనల్ దర్శకుడు.. భవిష్యత్తులో కూడా ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటూ.. పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.