ప్రతిరోజూ పండగే సక్సెస్ మీట్
సాయితేజ్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయిక. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు మారుతీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా హస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. రావు రమేష్, సత్యరాజ్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు సుకుమార్, పరుశురాం, పరుచూరి గోపాల కృష్ణ
పాల్గొన్నారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ….
ప్రతిరోజు పండగే సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపిగా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న తక్కువగా ఉన్న ఫ్రెండ్స్ లో బన్నీ వాసు నాకు ఒకడు. సైకాలజీ బాగా తెలిసిన వ్యక్తి కనుకనే ఇన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు తియ్యగలిగాడు బన్నీ వాసు. సినిమా సినిమా చూస్తున్న థియేటర్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మారుతి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం సంతోషంగా ఉంది. చాలా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్ తను. ఈ సినిమాలో పనిచేసిన అందరూ టెక్నీషియన్స్, నటీనటులకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ…
ఈ ఫంక్షన్ కు వచ్చిన సుకుమార్ గారికి, బుజ్జి గారికి ధన్యవాదాలు. నాకు ఎప్పుడు సపోర్ట్ చేసున్న బన్నీ వాసు అన్నాకు ధన్యవాదాలు. నా కెరీర్ కు పిల్లర్స్ లా నిలబడిన బన్నీ వాసు అన్నకు అలాగే మారుతి అన్నకు థాంక్స్. ఈ సినిమా నా కెరీర్ లొనే ఇంపార్టెంట్, ఇలాంటి సమయంలో నా దగ్గరికి ఒక మంచి కథను తీసుకొని వచ్చిన మారుతి గారికి థాంక్స్. మా సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. థియేటర్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సత్యరాజ్ గారు చేసిన రోల్ మర్చిపోలేను. రావు రమేష్ గారితో నేను చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తమన్ నా కాంబినేషన్ లో వచ్చిన మంచి సినిమా ఇది. మా సినిమాను సపోర్ట్ చేసున్న అందరికి ధన్యవాదాలు, ఈ సక్సెస్ ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం చేస్తున్న అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ….
ప్రతిరోజు పండుగే సినిమా కథను నమ్మి చేశాము. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తేజు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చాడు, అందుకు థాంక్స్. ఈ సినిమాను థియేటర్ లో ఆడియన్స్ మధ్య చూశాను, ఆడియన్స్ రియాక్షన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. రావు రమేష్ గారు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు, చాలా ఎమోషన్స్ ఉన్న రోల్ చేసాడు తను. నాకంటే ఎక్కువగా తమన్ ఈ సినిమాను నమ్మాడు. ఈ సక్సెస్ కు అందరూ కారణం, ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చేశాడు. ఇండస్ట్రీలో చాలామంది కాల్స్ చేసి మెచ్చుకున్నారు. ఈ సినిమాను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. మేము ఏ ఉద్దేశంతో తీశామో అది ఇప్పుడు ఆడియన్స్ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో అరవింద్ గారి సపోర్ట్ మరువలేనిదన్నారు.
తమన్ మాట్లాడుతూ….
మహానుభావుడు సినిమా తరువాత మారుతి నాకు ఈ అవకాశం ఇచ్చాడు మారుతి, తనకు థాంక్స్, మారుతితో సినిమా చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ సక్సెస్ చాలా ముఖ్యం, రెండు పెద్ద బ్యానర్లు చేస్తున్న సినిమా కావున తప్పకుండా ఈ సినిమా సక్సెస్ ను నేను ఉహించాను. యూవీ వంశీ కి అలాగే ఈ చిత్రంలో నటించిన అందరూ నటీనటులకు టెక్నీషియన్స్ కు స్పెషల్ థాంక్స్. సత్యరాజ్ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్స్ తో వర్క్ చెయ్యడం గ్రేట్ మెమోరీ, సాయి తేజ్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ….
నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. మారుతి నాకు కొన్ని ఏళ్ల నుండి పరిచయం, మా కలయికలో వచ్చిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం సంతోషంగా ఉంది. నేను నిర్మతగా మారడానికి ముఖ్య కారణమైన సుకుమార్ గారికి ధన్యవాదాలు, తాను స్టార్ట్ చేసిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇప్పుడు ఇంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది, అందరికి సుకుమార్ కు థాంక్స్, అలాగే నా బ్యానర్ లో గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ బుజ్జికి ధన్యవాదాలు. నాతో కలసి జర్నీ చేసిన మారుతి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు గర్వాంగా ఉంది. సక్సెస్ మీటర్ బాగా తెలిసిన దర్శకుడు మారుతి, తేజు తో ఒక మంచి సినిమా నిర్మించానన్న సంతృప్తి ఉందన్నారు.