Reading Time: 2 mins

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మీడియా సమావేశం

ఇష్క్` సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది – హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌.

`ఓరు ఆధార్ లవ్` మలయాళ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్… ఒకే ఒక్క కన్ను గీటుతో  ‘వింక్‌గాళ్‌’గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ప్రియా ప్ర‌కాశ్ హీరో తేజ స‌జ్జాతో క‌లిసి  ‘ఇష్క్‌` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
జులై30న  `ఇష్క్`  సినిమా విడుద‌ల‌వుతున్న‌ సంద‌ర్భంగా  ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మీడియాతో ముచ్చ‌టించింది. ఆ విశేషాలు..

– ‘ఇష్క్‌’ సినిమాను నేను సైన్‌ చేయడం చాలా తొందరగా జరిగిపోయింది. మాములుగా అయితే ప్రతీ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ నేను తీసుకొని మధ్యలో చాలా సార్లు డిస్కషన్స్ పెట్టి ఓకే చేస్తాను కానీ ఈ సినిమాకి మాత్రం రెండు రోజుల్లోనే ఓకే చేశాను. మలయాళ ‘ఇష్క్‌’ చిత్రాన్ని నేను చూశాను. ఈ చిత్రంలోని కథ, థ్రిల్లింగ్‌ అంశాలు నచ్చాయి. దీంతో ‘ఇష్క్‌’ సినిమా తెలుగు రీమేక్‌కు వెంటనే అంగీకరించాను. ఈ సినిమా రోటిన్‌ లవ్‌స్టోరీలా ఉండదు. ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది.

– ‘ఇష్క్‌’ సినిమా జర్నీని నేను చాలా బాగా ఏంజాయ్‌ చేశాను. తేజ మంచి  కో స్టార్‌. మీకు అందరికీ తెలుసు, తేజ చాలా యాక్టీవ్ గా ఉంటాడు  కాబ‌ట్టి సెట్స్ లో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ సెట్ అంతటినీ లైవ్ లో ఉంచుతాడు. నాకు తెలుగు డైలాగ్స్‌ విషయంలో బాగా హెల్ప్‌ చేశాడు.

–  ఈ చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజు సహకారం వల్ల మరింత బాగా నేను నటించగలిగాను. ‘మలయాళ వెర్షన్‌లోని హీరోయిన్‌ను మర్చిపో..నీ స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ చేయ్యి’ అని దర్శకుడు రాజు చెప్పారు. నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించగలిగాను. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ వంటి పెద్ద బ్యానర్‌లో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌.

– మలయాళ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్‌ల అభిరుచులు వేరని తెలుసు. అందుకే మలయాళ వెర్షన్‌ స్టోరీలోని సోల్‌ను మాత్రమే మేం తీసుకున్నాం. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు మార్పులు చేశాం. టెక్నికల్‌థింగ్స్‌ అలాగే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.

కథ, కథలోని పాత్ర తాలుకూ ప్రధాన్యం నన్నుఓ కొత్త సినిమా అంగీకరించేలా చేస్తాయి. కథే నాకు ముఖ్యం. తెలుగు భాషను నేను అర్థం చేసుకోగలను. భవిష్యత్‌లో పూర్తిగా తెలుగులో మాట్లాడతానన్న నమ్మకం ఉంది. ఇందుకు తగ్గ శిక్షణ తీసుకుంటున్నాను. టాలీవుడ్‌ నా సెకండ్‌ హోమ్‌.

– ‘చెక్‌’ సినిమాలో నాది చిన్నపాత్రే. ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనపెడితే నా పాత్ర మేరకు నేను నటించాను. నాకు మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. చెక్‌ చిత్రంలో నా స్క్రీన్‌ టైమ్‌ చాలా తక్కువ. కానీ ‘ఇష్క్‌’లో సినిమా అంతా తెరపై కనిపిస్తాను.

– ప్రస్తుతం  తెలుగులో ఒక ప్రాజెక్ట్  చేస్తున్నాను. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అలాగే మ‌ల‌యాళంలో ఒక స్ట్రాంగ్ స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాను. అలాగే హిందీలో రెండు సినిమాల‌కి సంభందించి అప్డేట్స్ రావాల్సి ఉంది.