ప్ర‌భాస్ హీరోయిన్ ఆమెనే ఫాలో అవుతుందా?

Published On: August 16, 2017   |   Posted By:

ప్ర‌భాస్ హీరోయిన్ ఆమెనే ఫాలో అవుతుందా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం సోహో. బాహుబ‌లి తో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని బాలీవుడ్ స‌హా అన్ని సినీ ఇండ‌స్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. `సాహో`తో ప్ర‌భాస్ సంద‌డి చేయ‌డం అనేది ఫిక్స‌య్యింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై చాలా రోజుల వ‌ర‌కు స‌స్పెన్స్ కొన‌సాగింది. ఎట్ట‌కేల‌కు ఆ స‌స్పెన్స్‌కు తెర దించుతూ యూనిట్ చిత్రంలో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుందని క‌న్‌ఫ‌ర్మ్ చేసింది.

ఇక్కడొక విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. గ‌తంలో ప్ర‌భాస్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఏక్ నిరంజ‌న్ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించింది. త‌ర్వాత మ‌రే తెలుగు సినిమాలోనూ న‌టించలేదు. మ‌రిప్పుడు ప్ర‌భాస్‌తోనే మ‌రో హీరోయిన్ ద‌క్షిణాదికి ఎంట్రీ ఇస్తుంది. మ‌రి కంగనా బాట‌లోనే శ్ర‌ద్ధా సాగుతుందా లేక ద‌క్షిణాది సినిమాల్లోనూ న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతుందా అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.