ప్లే బ్యాక్ మూవీ తెలుగు ఓటీటీ ఆహాలో

Published On: May 11, 2021   |   Posted By:
ప్లే బ్యాక్ మూవీ తెలుగు ఓటీటీ ఆహాలో
 
తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో మే 21 నుంచి ఎంగేజింగ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ప్లే బ్యాక్’
 
దినేశ్ తేజ్‌, వ‌కీల్ సాబ్ ఫేమ్ అన‌న్య నాగ‌ళ్ల, టి.ఎన్‌.ఆర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ప్లే బ్యాక్’. 2021లో విడుదలైన మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ఈ చిత్రం  మే 21 నుంచి తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ప్ర‌సార‌మ‌వుతుంది. జ‌క్కా హ‌రి ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. క్రైమ్ రిపోర్ట‌ర్(2019లో)కి,, సుజాత అనే అమ్మాయి(1993లో)కి మ‌ధ్య జ‌రిగే టెలిఫోన్ సంభాష‌ణ చుట్టూ ఈ థ్రిల్ల‌ర్ మూవీ న‌డుస్తుంది. ప‌లు ట్విస్టులు, ట‌ర్న్స్‌తో రెండు వేర్వేరు కాలాల‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు (2019లోని అబ్బాయి..1993లోని అబ్బాయి) మ‌ధ్య న‌డిచే థ్రిల్ల‌ర్ అంశాల‌తో న‌డిచే సినిమా ఇది. 
 
ప్ర‌ముఖ దివంగ‌త జ‌ర‌ల్నిస్ట్‌, న‌టుడైన టి.ఎన్‌.ఆర్‌లోని ఫెర్పామ‌ర్‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేసిన చిత్ర‌మిది. ఆయ‌న పోషించిన పాత్ర‌ల్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది ప్రారంభంలో.. విడుద‌లైన ఈ సినిమా, కె.బుజ్జి అందించిన సినిమాటోగ్ర‌ఫీ, క‌మ్రాన్ గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ‘ప్లే బ్యాక్’ చిత్రం ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ‘ఆహా’తో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత మంది సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. 
 
2021న ‘ఆహా’లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌, వెబ్ సిరీస్‌లైన‌  క్రాక్‌, నాంది, గాలి సంప‌త్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, థాంక్యూ బ్ర‌ద‌ర్‌, మెయిల్‌, సుల్తాన్ స‌ర‌స‌న ప్లే బ్యాక్ మూవీ కూడా చేరనుంది. ప్రేక్ష‌కుల ఇంటికి హండ్రెడ్ ప‌ర్సెంట్ వినోదాన్ని అందిస్తామ‌ని చెప్పిన మాట‌ను నిజం చేస్తోంది. ఈ వేస‌విలో వినోద‌పు ఆక‌లిని ‘ఆహా’ తీరుస్తుంద‌నే మాట మాత్రం నిజం.