ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల
పూర్ణోదయ క్రియేషన్స్, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్, మిత్ర వింద మూవీస్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నేచురల్ స్టార్ నాని
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమ్-కామ్ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
‘జాతిరత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
టీజర్ తో ఇప్పటికే ప్లాట్‌లైన్‌ను రివిల్ చేయగా, ట్రైలర్ మరిన్ని విజువల్స్, కంటెంట్‌ను ఇంటరెస్టింగా ప్రెసెంట్ చేసింది. హీరోకి తన గర్ల్ ఫ్రండ్ ని మెప్పించే అవకాశం వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుతుంది హీరో గర్ల్ ఫ్రండ్.
టిక్కెట్ల కోసం అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమైన హీరో చివరి ప్రయత్నంగా నేరుగా థియేటర్ వద్దకు వెళ్తాడు. అక్కడ భారీగా ప్రేక్షకులను, అభిమానుల జాతరని చూస్తాడు. హీరో తన ప్రేయసితో కలసి ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఇందులో కథాంశం
ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వెన్నెల కిషోర్ పాత్ర సినిమాలో అలరించబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. తనికెళ్ల భరణి హీరో తండ్రి పాత్రలో కనిపించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాషుల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగవ్వ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. దర్శకుడు వంశీధర్ పాత్ర నవ్వులు పూయించింది. ట్రైలర్ లో చివరి సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది.
నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. రాధన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కామెడీ మరింత ఎలివేట్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
`ఫస్ట్ డే ఫస్ట్ షో’ త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా
సాంకేతిక విభాగం
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్