ఫిదా రిపోర్ట్ – వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్

Published On: July 22, 2017   |   Posted By:
ఫిదా రిపోర్ట్ – వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్
ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఫిదా సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన రోజు బి, సి సెంటర్లలో కష్టమనే టాక్ వినిపించినప్పటికీ.. మొదటి రోజు వసూళ్లో ఫిదా అదరగొట్టేసింది. ఓవరాల్ గా ఈ సినిమా లాంగ్ రన్ కంప్లీట్ అయ్యేసరికి వరుణ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసే అవకాశముంది.
ట్రేడ్ ఎనలిస్ట్ ల లెక్క ప్రకారం ఫిదా సినిమా కంప్లీట్ రన్ లో దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసే అవకాశముందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెల్లూరులో మొదటి రోజు ఫిదా సినిమాకు 10లక్షల 77వేల రూపాయలొచ్చాయి. కృష్ణాలో 22 లక్షలు, ఉత్తరాంధ్రలో ఏకంగా 42 లక్షలు కలెక్ట్ చేసింది ఫిదా సినిమా.
శని, ఆదివారాలు కూడా ఇదే ఊపు కొనసాగితే ఫిదా సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో.. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశముంది. అటు ఓవర్సీస్ లో కూడా వరుణ్ తేజ్ కు స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేస్తోంది ఫిదా