బబుల్‌గమ్ చిత్రం ప్రీ బుకింగ్ ఈవెంట్
బబుల్‌గమ్ చాలా బూటీఫుల్ ఫిల్మ్. ట్రైలర్ చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చింది. సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుంది: గ్రాండ్ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్
ట్రైలర్‌లో రోషన్ నటన చూస్తే కొత్తవాడిలా అనిపించట్లేదు. రోషన్ విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు: హీరో విశ్వక్ సేన్
చిత్రంలో వుండే ఎమోషన్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు: హీరో రోషన్ కనకాల
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీ బుకింగ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ వేదికపై ఉన్న చాలామందితో నా ప్రయాణం మొదలైంది. నా మొదటి హిట్.. రవికాంత్ మొదటి సినిమా. అలాగే శ్రీచరణ్ మొదటి సినిమా కూడా. ఈ సినిమా టీమ్ నా కుటుంబంలాంటిది. సుమ గారు కెరీర్ బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. రోషన్ బబుల్‌గమ్ తో డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బబుల్‌గమ్ బ్యూటీఫుల్ మూవీ అనిపిస్తోంది. మా గురువు గారు అబ్బూరి రవిగారు ఈ సినిమాకి చిన్న గైడెన్స్ ఇచ్చారు. చాలా మంచి టీంతో కలసి సినిమా ఇది. లాంచ్ అవ్వబోతుంటే పేరెంట్స్ కళ్ళలో ఓ ఆనందం వుంటుంది. అది సుమ, రాజీవ్ గారి కళ్ళలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. మార్నింగ్ షో బబుల్‌గమ్ చూసి తర్వాత సలార్ కి వెళ్ళిండి( నవ్వుతూ). మనం ఒకట కోరుకుంటే అది సాధించగలమనే వైబ్ ఈ సినిమాలో వుంది. ఆ డైలాగ్ విన్నపుడు నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీ అందరికీ వస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 29న అందరూ థియేటర్స్ లో బబుల్‌గమ్ చూడాలి’ అని కోరారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ. ట్రైలర్ చూడగానే ఈ సినిమా హిట్ అవుతుందనిపిచింది. రోషన్ కమర్షియల్ హీరోలా కనిపించాడు. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్ని అంశాలు బాగున్నాయి. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు చాలా కలర్ ఫుల్ గా తీశారు. సుమ గారికి ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. నాకూ అంతే. ఎందుకంటే మా సోదరుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన రవికాంత్ కి థాంక్స్. మానస తెరపై అద్భుతంగా కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 29న బబుల్‌గమ్ థియేటర్స్ లో విడుదలౌతుంది. అంటుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రోషన్ చాలా లక్కీ అని అనుకుంటున్నా. రోషన్ విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు. అతని సినిమా విజయం అందుకుంటే ఆనందించే వారిలో నేనొకడిని. ట్రైలర్‌లోని రోషన్ నటన చూస్తే కొత్తవాడిలా అనిపించట్లేదు. చాలా ఇంటెన్సిటీ వున్న నటుడిగా కనిపిస్తున్నాడు. రవికాంత్ పేరేపు తీసిన గత చిత్రం కృష్ణ అండ్ లీలా నేరుగా థియేటర్స్ లో విడుదల కావాల్సింది. చాలా మంచి సినిమా అది.కానీ కోవిడ్ వలన కుదరలేదు. ఈ సినిమాతో ఘనం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ.. అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి గారు అందరూ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేస్తుందుకు చాలా ఆనందంగా వుంది. రవికాంత్ పేరెపు.. మీ గుండెల్లో రేపుతాడు ఓ మెరుపు, థియేటర్స్ లో పెట్టిస్తాడు అరుపు. ఆయన అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. శ్రీచరణ్ క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ సురేష్ ప్రతి ఫ్రేం అద్భుతంగా మలిచారు. మానస చాలా హార్డ్ వర్క్ చేసింది. జాన్వితో పక్కాగా లవ్ పడతారు. అనన్య, కిరణ్. సంజన, జైరాం, బిందు ఇలా అందరూ చాలా సహజంగా నటించారు. 24 క్రాఫ్ట్స్ కి సబంధించిన అందరూ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశారు. అందరికీ పేరుపేరునా థాంక్స్. నన్ను నమ్మి నాకు నచ్చింది చేయిస్తున్నందుకు అమ్మానాన్నలకు పాదాభివందనం. మా తాతయ్యలు నాన్నమ్మ అత్తా వీరంతా ఈ సినిమా చూస్తుంటే బావుండేది. కానీ వాళ్ళ దీవెనలు ఎప్పుడూ వుంటాయి. బబుల్‌గమ్ చిత్రంలో మనందరికీ వుండే ఎమోషన్స్ వుంటాయి. ఈ ఎమోషన్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు. ఒక మనిషి సక్సెస్ ని నిర్ణయించేది అతని హార్డ్ వర్క్, ప్రతిభ, క్రమశిక్షణ. మనందరి నసీబ్ లో ఏం రాసిపెట్టుందో ఎవరికీ తెల్వదు. కానీ నచ్చినట్లు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కుని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాత్ అయిన. ఒకరోజు వస్తది వద్దాన్నా వినపడతా.. చెవులు మూసుకున్నా వినపడతా. డిసెంబర్ 29 అందరూ థియేటర్స్ కి వచ్చి ఆది ప్రేమని, ఫైట్ ఫర్ రెస్పెక్ట్ చూడండి’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రవికాంత్ పేరేపు మాట్లాడుతూ.. మహేశ్వరి మూవీస్ నిర్మాణంలో పని చేయడం ఆనందంగా వుంది. సినిమాకి కావాల్సిన ప్రతిది చాలా అద్భుతంగా సమకూర్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్ చేయడం సంతోషంగా వుంది. అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, నందిని గారికి థాంక్స్. వారు ఈ వేడుకకు వారు రావడం ఆనందంగా వుంది. శ్రీచరణ్ తో కలసి పని చేయడం ఇది మూడోసారి. మా జర్నీ భవిష్యత్ లో కూడా కొనసాగుతుంది. అనన్య, కిరణ్. సంజన, జైరాం, బిందు సపోర్టింగ్ కాస్ట్ అంతా చాలా చక్కగా నటించారు. అబ్బూరి రవి గారు క్షణం నుంచి సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. ఇదంతా టీం ఎఫర్ట్. రోషన్, మానస వారి మొదటి సినిమాకి నేను దర్శకుడు కావడం అనందంగా వుంది. వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను చాలా బలంగా నమ్మారు. రోషన్, మానస కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. డిసెంబర్ 29న తప్పకుండా అందరూ బబుల్‌గమ్ థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.
హీరోయిన్ మానస మాట్లాడుతూ..మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు, నందిని రెడ్డి గారికి థాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నా తొలి చిత్రానికే ఇంత ప్రాధాన్యత వున్న పాత్ర దొరకడం ఆనందంగా వుంది. రోషన్ అద్భుతమైన కో స్టార్. తనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ థాంక్స్. సుమ గారు, రాజీవ్ గారు సొంత బిడ్డలా చూసుకున్నారు. ‘బబుల్‌గమ్’ ఆది జాన్వి అందరికీ కనెక్ట్ అవుతారు. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. అంతే ప్రేమతో మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రోషన్ ని ఏడాది క్రితం కలిశాను. అప్పుడు చాలా అమాయక కుర్రాడిలా కనిపించాడు. కానీ ఈ చిత్రం టీజర్ ట్రైలర్ లో తన విశ్వరూపం కనిపించింది. ఎక్స్ ట్రార్డినరీ గా చేశాడు. నటన తన జీన్స్ లో వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.