భరత్ అనే నేను మూవీ ఓ వసుమతి సాంగ్ రివ్యూ

Published On: April 11, 2018   |   Posted By:
భరత్ అనే నేను మూవీ ఓ వసుమతి సాంగ్ రివ్యూ

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. ఈ నెల 20న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుంచి మరో సింగిల్ రిలీజైంది. కొరటాల సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయో, అంతే డిఫరెంట్ గా క్యాచీగా ఉంది ఓ వసుమతి అనే తాజా సింగిల్.
ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ లో డ్యూయట్స్ లేవు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటల్లో ఇదే డ్యూయట్. యాసిన్ నైజర్, రీటా ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశాడు. రెగ్యులర్ గా డీఎస్పీ నుంచి వినిపించే మెలొడీస్ టైపులోనే ఈ పాట కూడా ఉంది. కాకపోతే మధ్యమధ్యలో మ్యూజికల్ చమక్కులు చూపించడం ఈ పాట స్పెషాలిటీ. లహరి మ్యూజిక్ పై ఈ పాట విడుదలైంది.