భళా తందనాన మూవీ రివ్యూ

Published On: May 10, 2022   |   Posted By:

భళా తందనాన మూవీ రివ్యూ

శ్రీవిష్ణు ‘భళా తందనాన’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

యాక్షన్ స్టార్ అనిపించుకోవాలని ప్రతీ హీరోకు ఉంటుంది. అయితే అందులో సక్సెస్ అయ్యేవాళ్లు తక్కువ మంది ఉంటారు. అందులోనూ చిన్న సినిమాల్లో యాక్షన్ చూపించాలంటే అవి తేలిపోతూంటాయి. కేజీఎఫ్,ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ యాక్షన్ సినిమాలు చూసాక ఓ మాదిరి యాక్షన్ సినిమాలు ఆనవు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా శ్రీ విష్ణు యాక్షన్ సినిమాలను ట్రై చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా శ్రీవిష్ణు చేసిన అర్జున ఫల్గుణ చిత్రం తేడా ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడీ సినిమా మన ముందుకు దూకింది. ఇంతకీ సినిమాలో విషయం ఏమిటి…శ్రీవిష్ణు ఈ సారైనా సక్సెస్ బాటలోకి వెళ్లాడా చూద్దాం.

Story line:

ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ శ‌శిరేఖ(కేథరిన్‌) కాస్తంత దూకుడు ఎక్కువే. ఆమె ఓ అనాధ శరణాలయంలో స్కామ్ జరిగిందని వెళితే అక్కడే అక్కౌంటెంట్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్(శ్రీవిష్ణు) పరిచయం అవుతాడు. ఈ న్యూస్ కనుక బయిటకు వస్తే ఫండ్స్ రావు, అనాధలు మరోసారి అనాధలు అవుతారని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ఆమె ఆగిపోతుంది. అయితే ఆ పరిచయం మాత్రం ఆగదు. వీళ్లిద్దరు టచ్ లో ఉంటారు. ఈ లోగా సిటిలో హవాలా కింగ్ ఆనంద్‌ బాలి(గరుడ రామ్‌) మనుష్యులు వరసగా కిడ్నాప్ అయ్యి చనిపోతూంటారు. అయితే వాళ్ళను ఎవరు చంపుతున్నారనే విషయమై ఆమె ఇన్విస్టిగేట్ చేసి కథనాలు ప్రచురిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ నిజం తెలుస్తుంది. ఇదంతా చేస్తోంది తనతో పాటే తిరుగుతూ అమాయికుడులా నటిస్తున్న చంద్రశేఖర్ అని అర్దమవుతుంది. అయితే ఎందుకలా చేస్తున్నాడు అంటే ఈ హవాలా కింగ్ దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని కొట్టేయటానికి అని అర్దమవుతుంది. ఈ లోగా అనుకోని విధంగా ఆ హవాలా కింగ్ నే చిన్న గేమ్ ఆడి అతని మనుష్యుల చేతే చంద్రశేఖర్ చంపేస్తాడు. అయితే ఎందుకు ఇలా చేసాడు. అసలు ఎవరీ చంద్రశేఖర్ అంటే సీక్వెల్ లో చూడమని ఎండ్ చేసారు.

Screenplay Analysis:

ఈ సినిమాని కేవలం ట్విస్ట్ లు నమ్ముకుని చేసినట్లు అర్దమవుతుంది. ఓ మనీహీస్ట్ వెబ్ సీరిస్, క్లైమాక్స్ స్క్విడ్ గేం నుంచి తీసుకున్న ఈ సినిమా కథ ఓ వెబ్ సీరిస్ కంటెట్ లాగే ఉంటుంది తప్పించి సినిమాలా అనిపించదు. ఎక్కడా థ్రిల్లింగ్ గా ఉండదు. ఫస్టాఫ్ అలా అలా నడిచిపోయినా సెకండాఫ్ లో హీరో ఎవరో రివీల్ అయ్యాక ఇంక డ్రామా క్రియేట్ అవ్వక కథ ముందుకు వెళ్లక విసిగిస్తుంది. ముఖ్యంగా కొద్దిపాటి సినిమా అనుభవం ఉన్నవాడు కూడా కనిపెట్టేలా చాలా ప్రెడిక్టుబుల్ గా సాగుతుంది. సెకండాఫ్ అయితే దారుణం.. చాలా బోరింగ్ గా , హీరో వన్ సైడ్ డ్రామా గా సాకుతుంది. స్క్రీన్ ప్లేలో సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా అని రాసుకున్నారు. కానీ ఈ ఫస్ట్ పార్టే వర్కవుట్ కాక వక్రంగా ఉంది. అయితే విలన్ క్యారక్టరైజేషన్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది . త‌న రూపాయి కోసం ల‌క్ష రూపాయ‌లైనా ఖర్చు పెట్టే విలన్ క‌థ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే అది కాసేపే. కొద్దిసేపే. కాసేపటికే హీరో,విలన్ మధ్యా గేమ్ డల్ అవటం మొదలవుతుంది. హీరోని హైలెట్ చేయటం కోసం విలన్ ని తగ్గించుకుంటూ వెళ్లిపోయారు. ఇవన్నీ హీరోయిన్ కు తెలిసే సరికే కథ క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ప్రేక్షకుడికి ఇదంతా క్లారిటీ గా తెలియాలంటే సెకండ్ పార్ట్ చూడాలంటారు. ఇలా ఈ సినిమాని ఏదో థ్రిల్లర్ చేద్దామని చివరకు అటూ ఇటూ కాకుండా చేసేసారు. ఈ సినిమా చూస్తూంటే మనకు రవితేజ ఖిలాడీ గుర్తు కు వస్తే మీ తప్పుకాదు.

Analysis of its technical content:

టెక్నికల్ గా ఈ సినిమా రిచ్ గానే ఉంది. మణిశర్మ పాటలు ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నిలిపారు. సురేశ్‌ రగుతు కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ ఎడిటింగ్ చాలా ల్యాగ్ లు వదిలేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ‘బాణం’లాంటి ఇంటెన్సిటీ ఉన్న సినిమాని తీర్చిదిద్దిన ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తీసాడంటే నమ్మలేం.

నటీనటుల్లో …శ్రీ విష్ణు తన పాత్రను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎక్కడా నిరాశపరచడు. నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా కేథరిన్‌ అందంగా ఉంది కానీ నటనగా ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆమే డబ్బింగ్‌ చెప్పుకుంది కానీ బాగోలేదు. విలన్‌గా గరుడ రామ్‌ కేజీఎఫ్ స్దాయిలో చేద్దామనుకున్నాడు. అయితే అతనికి బలమైన సీన్స్‌ లేవు. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ బాగున్నాయి.

CONCLUSION:
సినిమా ఓ టైమ్ దాటాక బోర్ కొట్టేస్తుంది. శ్రీ విష్ణు అభిమానులు మాత్రమే చూసి భరించగలరు.

Movie Cast & Crew

నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్‌, గరుడ రామ్‌, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు
దర్శకుడు: చైతన్య దంతులూరి
కథ, డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా
సంగీతం: మణిశర్మ
బ్యానర్‌: వారాహి చలనచిత్రం
నిర్మాత: రజనీ కొర్రపాటి
సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు
ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌
Run Time: 2 Hour 14 Mins
విడుదల తేది: మే 6, 2022