భానుమతి అండ్ రామకృష్ణ ఏడాది పూర్తి
ఏడాది పూర్తి చేసుకున్న `ఆహా` ఓటీటీ తొలి డైరెక్ట్ ఓటీటీ బ్లాక్ బస్టర్ `భానుమతి అండ్ రామకృష్ణ`
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో విడుదలై పరిణితి చెందిన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులకు గుర్తుండి పోయిన ప్రేమ కథాచిత్రం `భానుమతి అండ్ రామకృష్ణ` విడుదలై(జూలై 3,2020) నేటికి సరిగ్గా ఏడాది అయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరి మనసులను హత్తుకుంది. నవీన్ చంద్ర, సలోని లుథర జంటగా నటించారు. మూడు పదుల వయసులోని ఇద్దరు వ్యక్తులు.. తెనాలిలో పుట్టి పెరిగిన సిగ్గరి అయిన యువకుడు రామకృష్ణకు, సిటీ వాతావరణంలో స్వతంత్ర్య భావాలతో పుట్టి పెరిగిన అమ్మాయి భానుమతికి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథాంశం అందరినీ ఆకట్టుకుంది. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం..వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రేమ, హాస్యం వంటి డిఫరెంట్ ఎమోషన్స్ అందులోని ఆటు పోట్లను చూపించింది.
2020లో డిజిటల్ మాధ్యమంలో డైరెక్ట్‌గా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `భానుమతి అండ్ రామకృష్ణ` చిత్రాన్ని ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు ప్రశంసించారు. ప్రేక్షకులు తప్పకుండా వీక్షించాల్సిన టాప్ టెన్ చిత్రాల్లో `భానుమతి అండ్ రామకృష్ణ` ఒకటి అంటూ ఇండియా టుడే పత్రిక ప్రశంసించగా, తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ అని హన్స్ ఇండియా పత్రిక వ్యాఖ్యానించింది. స్త్రీ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే రీతిలో చక్కగా తెరకెక్కించబడిని చిత్రమని, స్లైస్ ఆఫ్ రొమాన్స్ మూవీ అని, స్వచ్చమైన గాలిని పీల్చుకున్న అనుభూతిని కలిగించే చిత్రమని హిందూ పత్రిక ప్రశంసించింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాకు ప్రేక్షకుల హృదయాల్లో ఓ నమ్మకాన్ని ఏర్పరిచిన చిత్రంగా నిలిచిందీ చిత్రం.
ఓటీటీ డెబ్యూ మూవీగా `భానుమతి అండ్ రామకృష్ణ` తెచ్చిన గుర్తింపు గురించి హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ “`భానుమతి అండ్ రామకృష్ణ` నటుడిగా నన్ను నేను గుర్తించడంతో ఎంతగానో సహాయపడింది. నటుడిగా ఈ సినిమాను వదులుకోలేకపోయాను. రామకృష్ణలా ఉండే చాలా మంది యువకుల ప్రతినిధిగా కనిపించాను. తనకు జీవితంలో బాధను కలిగించే విషయాన్ని అయినా కూడా సంతోషంగా స్వాగతించే సిగ్గరి అయిన యువకుడే రామకృష్ణ. ఇలాంటి ఓ కథను నమ్మి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన `ఆహా`కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సలోని లుథరా మాట్లాడుతూ “డైరెక్టర్ శ్రీకాంత్ నాగోటి భానుమతి అనే డిఫరెంట్ అమ్మాయి పాత్రను క్రియేట్ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్. మూడు పదుల వయసులో పెళ్లి కానీ యువత ఆలోచనలను వాస్తవికతకు దగ్గరగా చూపిస్తూ సినిమాను రూపొందించారు. ఓ నటిగా ఇంత మంచి సినిమా కంటే గొప్పగా ఏదీ కోరుకోలేను“ అన్నారు.
ఓ మంచి సినిమాను చూశామని నమ్మకాన్ని మీలో మరోసారి నింపడానికి `భానుమతి అండ్ రామకృష్ణ` చిత్రాన్ని ఈరోజు మరోసారి వీక్షించేయండి. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతం.. నవీన్ చంద్ర, సలోని లుథరా పెర్ఫామెన్స్, దర్శకుడు శ్రీకాంత్ నాగోటి జీవితంలో ప్రేమను ఆవిష్కరించిన తీరు మీకు తప్పకుండా నచ్చుతుంది. భానుమతి అండ్ రామకృష్ణతో పాటు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, అర్థ శతాబ్దం, లెవన్త్ అవర్, క్రాక్, జాంబి రెడ్డి, నాంది, సుల్తాన్, చావు కబురు చల్లగా వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్, వెబ్ షోస్ మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తాయి.