Reading Time: 3 mins
 భామాకలాపం మూవీ రివ్యూ
Bhama Kalapam web series first look
 ప్రియమణి ‘భామాకలాపం’ రివ్యూ
 Emotional Engagement Emoji (EEE)
 
?
ఓటిటిలో వచ్చే సినిమాలను ఎప్పుడో అప్పుడు ఖాళీ టైమ్ చూసుకుని చూడచ్చులే అనుకుంటారు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాత్రం వెంటనే చూసేయాలని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అందుకు కారణం ప్రియమణి వారి అభిమాని హీరోయిన్ కావటం కాదు…క్రైమ్ కామెడీ జానర్ తమకు ప్రియతమనైది కావటం. అయితే ఈ సినిమా ఆ ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదా?story lineమధ్యతరగతి ఇల్లాలు అనుపమ (ప్రియమణి) ఇల్లాలు అందరికన్నా కొద్దిగా హైపర్ యాక్టివ్. భర్త,పిల్లలతో పాటు తన పేరున ఓ వంటల యూట్యూబ్ ఛానెల్ నడపటంలోనే ఆమె టాలెంట్ దాగి ఉంది. కొత్త విషయాలు ముఖ్యంగా ప్రక్కింటి భాగోతాలు తెలుసుకోవటం అంటే మహా సరదా. అందుకోసం పనిమనిషి సాయిం తీసుకుంటుంది. అలా తన అపార్టమెంట్ లో ఉంటే జనాల జీవితాల్లోకి తొంగి చూసే క్రమంలో ఆమె ఓ రోజు ఒకరి ఇంట్లోకి వెళ్లి ఊహించని విధంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఆమెకి మరిన్ని సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతాయి. మరి ఈ సమస్య నుండి అనుపమ ఎలా తప్పించుకుంటుంది. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు. ఫైనల్ గా అనుపమ ఏమవుతుంది అనేది అసలు కథ.screenplay analysis

ప్రియమణి…ఒక మధ్య తరగతి ఇల్లాలు. భర్త.. కొడుకుతో కలిసి ఒక అపార్ట్ మెంట్లో  ఉండే ఆమెకు పక్క వాళ్ల సంగతులంటే మహా ఆసక్తి అని  క్యారక్టర్ ని డిజైన్ చేయటంలో దర్శకుడు మార్కులు వేయించేసుకుంటాడు. అదొక లవుబుల్ , లైకబుల్ క్యారక్టర్ గా మారిపోతుంది. అంతేకాకుండా ఆమె యూట్యూబ్ లో  కుకింగ్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదిస్తుంది అనగానే ట్రెండీగా మారిపోయింది. అయితే అలాంటి క్యారక్టర్ ని తీసుకెళ్లి క్రైమ్ లో పడేసేటప్పుడే డైరక్టర్ తడబడిపోయాడు. రెండు వందల కోట్ల విలువ చేసే కోడుగుడ్డు అంటూ ఓ ఎలిమెంట్ ని తీసుకొచ్చి  క్రైమ్ కు యాడ్ చేసాడు. అంతే అఫ్పటిదాకా నమ్మిన క్యారక్టర్ మొత్తం డ్రాప్ అవటం మొదలెడుతుంది. అప్పటిదాకా వాస్తవంగా మనింట్లో జరిగే కథ అనిపించింది కాస్తా కల్పితంగా మారిపోతుంది. దాంతో ఆ క్యారక్టర్ చేసే డార్క్ హ్యూమర్ …మరింత డార్క్ గా మారి భయపెడుతుంది. నవ్వించదు సరికదా నవ్వులు పాలువుతుంది.  అలాగే ఎడిటింగ్ పోయిందో లేదో స్క్రిప్టులో లేదో కానీ  ప్రియమణి భర్త పాత్ర కంప్లీట్ ఫీలింగ్ ని ఇవ్వదు.

క్రైమ్  డ్రామా సీన్స్ ని యాడ్ చేసేందుకు అవకాసం ఉన్నా.. వదిలేసారు. అతిశయోక్తి…అతికు మధ్య తేడా తేల్చుకోలేకపోయారు. ఇక విలన్ పాత్ర కూడా ఫుల్ ప్యాసివ్ మోడ్ లో డల్ గా ఉంది.  దాంతో ప్రియమణి పాత్ర లో విషయం ఉన్నా ఎలివేషన్ లేకుండా పోయింది. దానికి తోడు దర్శకుడు క్లయిమాక్స్ లో ఊహకందని ముగింపునిచ్చి వీక్షకులను ఉలిక్కి పడేట్టు చేస్తాడనుకుంటే అదీ జరగలేదు. టోటల్ గా స్క్రిప్టు విషయంలో ఈ సినిమా చాలా భాగం ఫెయిలైందనే చెప్పాలి. క్రైమ్ కామెడీలు మాత్రం ఇలా పొరపాటున చెయ్యకూడదనిపించేలా చేసారు. శిలువ ఎక్కిన ప్రభువు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాడని నమ్మడం, ఆ నమ్మకాన్ని చుట్టూ ఉన్న వారి బుర్రలోకి ఇంజెక్ట్ చేయడం, ప్రభువు రాకడ కోసం ఎంతకైనా తెగించడం… ఈ పాత్ర నైజం ను అర్థం చేసుకుని, ఓ రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళి నటించినట్టుగా చేశాడు..ఆ సీన్స్ అన్ని మనకు అనుకోకుండా ఒక రోజు సినిమాని గుర్తు చేస్తాయనటంలో సందేహం లేదు.

Technical Analysis:

కొత్త దర్శకుడు అయినా అభిమన్యు తన టీమ్ నుంచి మాగ్జిమం అవుట్ ఫుట్ తీసుకున్నారు. అయితే కొన్ని సీన్స్ లో షాట్స్ కాస్త స్లోగా ఉండటం నిరాశ కలిగిస్తాయి. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించినా.. సినిమా విజువల్స్ రిచ్ గా కనిపిస్తాయి. ప్రియమణి వంటి  ప్రధాన పాత్రధారులే కాకుండా చిన్న చిన్న పాత్రలు చేసిన వారి నుండి కూడా చక్కని నటనను దర్శకుడు అభిమన్యు రాబట్టుకోవటం కలిసివచ్చింది.

ఇక జస్టిన్ ప్రభాకర్ సంగీతం ఓ మాదిరిగా కూడా లేదు. కానీ మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అలానే దీపక్ సినిమాటోగ్రఫీ  అదిరింది. విప్లవ్ నైషధం ఎడిటింగ్ నీట్ గా ఉంది. జై కృష్ణ రాసిన డైలాగులు ఓకే అన్నట్లున్నాయి.

నటీనటుల్లో …

ప్రియమణి  ఎప్పటిలాగా తన పాత్రకు న్యాయం చేసింది. క్యారక్టర్ కు కావాల్సిన intensity ని క్రియేట్ చేసింది.  అలాగే శరణ్య, కిషోర్ కుమార్ లు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించారు. ఈ చిత్రంలో చర్చ్ ఫాథర్ గా కనిపించిన నటుడు కిషోర్ కుమార్ కూడా మంచి నటనను కనబరిచారు.

చూడచ్చా

చూడకూడనటువంటి సినిమా మాత్రం కాదు. ఓ లుక్కేయచ్చు.

ఎవరెవరు..

నటీనటులు: ప్రియమణి, శాంతిరావు, జాన్ విజయ్, శరణ్య తదితరులు
ఎడిటర్: విప్లవ్
సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరగార
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్
నిర్మాతలు: బాపినీడు, సుధీర్
దర్శకత్వం: అభిమన్యు తడిమేటి
రన్ టైమ్: 2h 13m
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022
ఓటీటీలో : ఆహా