మంచు హీరోతో పరుశురాం

Published On: February 1, 2018   |   Posted By:

మంచు హీరోతో పరుశురాం

సోలో, యువ‌త‌, ఆంజ‌నేయులు, సారొచ్చారు, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌రుశురాం ఇప్పుడు యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌రకొండతో సినిమా చేస్తున్నాడు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. దీనికి టాక్సీవాలా అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. `ఛలో` ఫేమ్ ర‌ష్మిక మండ‌న్నా ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత ప‌రుశురాం మంచు విష్ణుతో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌నేది స‌మాచారం. ప్ర‌స్తుతం మంచు విష్ణు `ఆచారి అమెరికా యాత్ర‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.