మణిశంకర్ చిత్రం టీజర్ విడుదల
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ-కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్కృష్టణ్) నిర్వహించారు.
లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన లభించింది.
తాజాగా మణిశంకర్ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా..
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ – “మణిశంకర్ పోస్టర్స్, టీజర్ చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకుని దర్శకుడు జీవీకే ఈ స్క్రిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. రియలెస్టిక్‌గా ఉంది. శివ కంఠమనేని గారి పెర్ఫామెన్స్ అరెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి జీవీకే, శివ గారి కెరీర్‌కు హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ మణిశంకర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
చిత్ర దర్శకుడు జీవీకే మాట్లాడుతూ – “కళ్యాణ్ కృష్ణగారు మంచి పాజిటీవ్ యాటిట్యూట్ ఉన్న డైరెక్టర్. అందరికీ మంచి జరగాలని కోరుకునే మంచి మనసున్న వ్యక్తుల్లో ప్రముఖుడు. మా మణిశంకర్ మూవీ టీజర్ కళ్యాణ్ కృష్ణగారి చేతులమీదుగా రిలీజవడం హ్యాపీగా ఉంది. మణిశంకర్ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్. మంచి కంటెంట్‌ని యాక్షన్ మోడ్, సస్పెన్స్ వేలో చెప్పడం జరిగింది. మంచి టీమ్ తో కలిసి పనిచేశాం కాబట్టి ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది“ అన్నారు.
హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ – “టీజర్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. మంచి ఎంటర్టైనర్ సబ్జెక్ట్. మణిశంకర్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ చేసే కొన్ని డీలింగ్స్‌కి సంభందించిన కథ. సంజన, చాణుక్య, ప్రియా హెగ్డే ఈ నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ. ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది“అన్నారు.
తారాగణం: శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణిక్య, మాణిక్య రెడ్డి, సుబ్బరాజ్ శర్మ, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి. వెంకట్ కృష్ణన్ (జీవికే)
నిర్మాతలు: కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణి భూషణ్
బ్యానర్: లైట్ హౌస్ సినీ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర్ రెడ్డి
సంగీతం: ఎం.ఎల్.రాజా
ఎడిటర్: సత్య గిదుటూరి
ఆర్ట్: షేరా
ఫైట్స్: వింగ్‌చున్ అంజీ