మధ మోషన్ పోస్టర్ విడుదల
రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య దర్శకత్వంలో ఇందిరా బసవ నిర్మిస్తోన్న చిత్రం ‘మధ’. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగిది. ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ హరీశ్ శంకర్, యాక్టర్ నవదీప్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి 13న సినిమా విడుదలవుతుంది. ఈ కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ – ‘‘సాధారణంగా యంగ్ ఏజ్‌లో అందరూ డబ్బులు పెట్టి సినిమాలు చూస్తారు. కానీ శ్రీవిద్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీసింది. హీరోని ఆరాధిస్తూ సినిమాలు ఇష్టపడుతూ కమర్షియల్ సినిమాలు తీసే నాలాంటి డైరెక్టర్‌కి సినిమా రిలీజ్ అయితేనే పండగ. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు.. చాలా ప్యాషన్‌తో సినిమా చేసిందనిపించింది. తనకు ఇంకా పెద్దగా గుర్తింపు రావాలని భావించాను. మన తెలుగు అమ్మాయి చేసిన ఈ మధ సినిమాను చాలా ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. శ్రీవిద్య మన తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని నేను, మహేశ్, నవదీప్ ముందుకు వచ్చాం. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ – ‘‘శ్రీవిద్య నా ఫేస్బుక్ ఫ్రెండ్. తనకు మధ సినిమాకు వచ్చిన ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ మూవీ అవార్డ్స్ చూసిన తర్వాత తనతో మాట్లాడాను. నేను సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకుడిగా చెప్పగలను. సినిమా చూసిన ఓ పెద్ద ప్రొడ్యూసర్… ఇదే సినిమాను పెద్ద హీరోయిన్‌తో చేయమని అంటే కూడా తను తన టీమ్ కోసం ఒప్పుకోలేదు. మహేశ్‌గారు, హరీశ్‌గారు సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. వారికి థాంక్స్’’ అన్నారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుమాట్లాడుతూ – ‘‘ఈ సినిమా రిలీజ్‌కు కారణం హరీశ్‌గారు, నవదీప్గారు. హరీశ్‌గారు పెద్ద డైరెక్టర్ అయినా కూడా చిన్న సినిమా డైరెక్టర్ అడగ్గానే సమయాన్ని కేటాయించి ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే నవదీప్‌గారికి స్పెషల్ థాంక్స్. శ్రీవిద్యగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మార్చి 13న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.
అనీశ్ మాట్లాడుతూ – ‘‘పర్టికులర్ జోనర్, స్పేస్‌లో చేసిన సినిమా మధ.ఈ సినిమాకు 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. దీనికి అందరికీ సపోర్ట్ అవసరం. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో శ్రీవిద్య ఈ సినిమాను తెరకెక్కించింది. సైకలాజికల్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు కొత్త నెరేషన్ సినిమా అని అనుకుంటున్నాను. శ్రీవిద్య అమ్మగారే ఈ సినిమాను నిర్మించారు. హరీశ్, మహేశ్, నవదీప్ ఈసినిమాకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం గొప్పవిషయం. వారిని నా థాంక్స్’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ అభిరాజ్ మాట్లాడుతూ – ‘‘మార్చి 13న విడుదలవుతున్న మా సినిమాను ఆదరించండి’’ అన్నారు.
రైటర్ ప్రశాంత్ మాట్లాడుతూ – ‘‘అన్నీ ఎమోషన్స్‌ను ఓ కాన్వాస్‌గా చేసిన సినిమా ఇది’’ అన్నారు.
డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ – ‘‘మూడేళ్ల నా కల నేరవేరిన రోజుది. నాతో పాటు మా టీమ్ అంతా ట్రావెల్ చేసింది. అందరూ ఎంతో డేడికేషన్‌తో చేసిన సినిమా ఇది. అందరూ నమ్మకంతో చేసిన సినిమా ఇది. హరీశ్‌గారు, మహేశ్‌గారు, నవదీప్‌గారికి థాంక్స్. రెగ్యులర్ సినిమా కాదు. ప్యారలల్ మూవీ అనొచ్చు. ప్రతి అమ్మాయి ఈ సినిమా కాన్సెప్ట్‌కి కనెక్ట్ అవుతుంది. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తున్నాం. 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డ్ వచ్చాయి. మార్చి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కంటెంట్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
హీరోయిన్ త్రిష్నా ముఖర్జీ మాట్లాడుతూ – ‘‘మా సినిమాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన హరీశ్‌గారికి, మహేశ్‌గారికి, నవదీప్‌గారికి థాంక్స్. అన్నీ రకాల ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూడొచ్చు. శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే నచ్చింది. సపోర్ట్ చేసిన ఎంటైర్ యూనిట్‌కి థాంక్స్. మార్చి 13న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.