Reading Time: 3 mins

మరో ప్రస్థానం సినిమా ట్రైలర్ విడుదల




తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది.

 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ …ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా మరో ప్రస్థానం సినిమా ఉంటుంది. నటీనటుల పర్మార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్ ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు మనసుపెట్టి కష్టపడి పని చేశారు. ఇలాంటి సినిమాలు రియల్ గా చాలా అరుదుగా వస్తుంటాయి. మరో ప్రస్థానం  సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. నా గత చిత్రం అంతకుమించి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్త తరహా కథతో సినిమా చేయాలని మరో ప్రస్థానం కథను డిజైన్ చేసుకున్నాను. నా కథ నచ్చి నిర్మాతలు వెంటనే సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. సింగిల్ షాట్లో  కమర్షియల్ సినిమా తీసి అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చేయలనుకుని ఈ కథను రాసుకొన్నాను. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్  జరగలేదు. ఫస్ట్ రిహర్సల్  చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. తెలుగు రాకున్నా ముస్కాన్ సేథీ చాలా కష్టపడి చాలా డెడికేషన్ తో వర్క్ చేసింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. కబీర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీరో తనీష్ గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో ప్రస్థానం సినిమాలో  హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు.


హీరో తనీష్ మాట్లాడుతూ …చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది . మేము చాలా కష్టపడి మరో ప్రస్థానం సినిమా చేయడం జరిగింది ఈ సినిమా చూస్తే మా కష్టం మీకే తెలుస్తుంది..ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది.  ఈ సినిమాలో ప్రస్తుతం సొసైటీ లో జరుగుతున్న వాస్తవ ఘటనలు, బర్నింగ్ ఇష్యూస్ చూపిస్తున్నాం. చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయిని ఎవరో తెలియని వక్తి వచ్చి ఆ అమ్మాయి లైఫ్ ను డిసైడ్ చేస్తున్నాడు. ఇలాంటి  ఎలిమెంట్ ఉన్న కథను మరో ప్రస్థానం సినిమాలో చూస్తారు. సోషల్ గా ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఏర్పడుతోంది. వన్ షాట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మరో ప్రస్థానం సినిమా టెక్నికల్ గా కథ పరంగా చాలా స్ట్రాంగ్ .చాలా మంది వన్ షార్ట్ ఫిలిం అంటే ఏంటి ఈ సినిమాకు అంత స్పెషల్ ఏంటి అంటారు. మరో ప్రస్థానం సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా డెడికేషన్ గా పనిచేశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి సందర్భాలు బయట ఉండకూడదు అని కోరుకుంటున్నాను. మనం సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే మరో ప్రస్థానం సినిమాను ఈ నెల 24న థియేటర్లలోనే విడుదల చేస్తున్నాము. అన్నారు.


కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ …సింగల్ షాట్  మూవీ  మరో ప్రస్థానంలో  నటించడం ఆనందంగా ఉంది. నేను సౌత్ లో దాదాపు 50 చిత్రాల్లో నటించాను. కానీ ఏ సినిమాలో డాన్సులు చేసే ఆవకాశం రాలేదు. మరో ప్రస్థానం చిత్రంలో నాతో దర్శకుడు జాని డ్యాన్స్ లు చేయించారు. నేను ఇప్పటిదాకా చేయని కొత్త తరహా విలనీని మరో ప్రస్థానం చిత్రంలో చేశాను. అన్నారు.


హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ ..మరో ప్రస్థానం చిత్రంలో ఫస్ట్ టైం  ఛాలెంజింగ్ పాత్రలో నటించాను. వన్ షార్ట్ ఫిలిం లో నటించే ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అన్నారు.


రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ – క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ – జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ – కపిల్, ఫైట్స్ – శివ, సమర్పణ – ఉదయ్ కిరణ్, నిర్మాణం – మిర్త్ మీడియా, రచన దర్శకత్వం – జాని.