మహారాజ మూవీ జూన్ 14 విడుదల
విజయ్ సేతుపతి మూవీ మహారాజ ఏపీ & తెలంగాణలో గ్రాండ్ గా విడుదల
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ మహారాజ రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు.
ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమౌతున్న నేపధ్యంలో తెలుగు ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్విఆర్ సినిమా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ ని దక్కించుకుంది. ఎన్విఆర్ సినిమా ఏపీ, తెలంగాణలలో మహారాజ ని మ్యాసివ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి తన లక్ష్మిని వెదికే ఒక ఆర్డినరీ బార్బర్ గా చూపించిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చివర్లో, విజయ్‌ని ఎదుర్కొనేందుకు అనురాగ్ కశ్యప్ రివిల్ కావడం ఎక్సయిట్మెంట్ ని పెంచింది. ట్రైలర్‌కి గ్రాండ్ రిసెప్షన్ రావడంతో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది.
మహారాజాలో మమతా మోహన్‌దాస్, భారతీరాజా, నటరాజన్ సుబ్రమణ్యం, సింగంపులి కల్కి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తమన్, మ్యూజిక్ బి అజనీష్ లోకనాథ్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.
నటీనటులు :
విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్
టెక్నికల్ సిబ్బంది:
రచన & దర్శకత్వం: నితిలన్ సామినాథన్
నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
తెలుగు రిలీజ్: NVR సినిమాస్
మ్యూజిక్: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్