మహేష్ మనసుకు నచ్చింది

Published On: January 10, 2018   |   Posted By:
మహేష్ మనసుకు నచ్చింది

షో’, ‘కావ్యాస్ డైరీ’ చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న మంజుల ‘వునసుకు నచ్చింది’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధైమెంది.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో కృష్ణ తన కుమార్తె మంజుల దర్శకురాలిగా పరిచయువువుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘వునసుకు నచ్చింది’ తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆశీర్వదించారు.
ఇప్పుడు హీరో మహేష్ తన సోదరి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు ట్విట్టర్‌లో విడుదల చేసి ‘ఎమోషన్స్‌తో కూడిన చక్కని ప్రయాణంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి పనిచేసిన వారంతా ఎంతో అభిరుచి ఉన్న యూత్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. నా సోదరికి, ‘వునసుకు నచ్చింది’ యూనిట్‌కి నా బెస్ట్ విషెస్ తెలియుజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.