మాజీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: July 16, 2021   |   Posted By:

మాజీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

హీరోస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బి. వినోద్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  ‘మాజీ’. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు సెట్స్ మీదకి వెళ్ళడానికి  సిద్ధం అవుతుంది.

నక్సలైట్  బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. హీరో, నిర్మాత, దర్శకుడైన వినోద్ కుమార్ బర్త్ డే(జూలై16) సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

కొత్త, పాత నటీనటులందూ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్ర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలియజేశారు.ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు: బి. వినోద్ కుమార్.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. అనిల్ కుమార్.