మార్చి 22 వినరా సోదరా వీర కుమారా చిత్రం

Published On: March 15, 2019   |   Posted By:

మార్చి 22 వినరా సోదరా వీర కుమారా చిత్రం

మార్చి 22న ప్రేక్షకుల ముందుకు “వినరా సోదరా వీర కుమారా” చిత్రం. లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “వినరా సోదరా వీరకుమార”. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ నా మిత్రులు నిర్మించిన ఈ సినిమా ఒక కొత్త పాయింట్ తో అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను . ప్రేమకోసం చంపడం చావడం రెండు తప్పే అనే కొత్త పాయింట్ ను డైరెక్టర్ సతీష్ చాల అందంగా తెరకెక్కించారు అని అన్నారు.

చిత్ర నిర్మాత లక్ష్మణ్ క్యాదారి మాట్లాడతూ ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంతో కష్టపడి ఒక మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నాము. వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ పైనే కష్టపడ్డారు దర్శకుడు సతీష్. అందరినీ మెప్పించాలని చేసిన ఈ మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ కు నేను జన్మాతం రుణపడి ఉంటాను. ఒక కొత్త పాయింట్ తో సినిమా ను తెరకెకించడం జరిగింది. సినిమా చూసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు. అందరి సపోర్ట్ తో ఈ 22న సినిమాను విడుదల చేయనున్నాము. అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు.

హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ ఈ నెల 22న అఫీషియల్ గా ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందని తెలియ చేస్తున్న ఈ రోజు మాకు ముఖ్యమైన రోజు గా భావిస్తున్నాను. ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు గారు విడుదల చేసారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కొత్త పాయింట్ తో వారితో చేసిన సినిమా అందరి ఆదరణ పొందుతుందని నమ్మకం గా ఉన్నాను. ఇదివరకు నేను చేసిన సినిమాల కంటే బెటర్ పేరు, సినిమా అవుతుందని భావిస్తున్నా అన్నారు.  ఇప్పటి వరకు ఇది మా సినిమా 22 నుంచి మీ సినిమా కనుక ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.  

ఇంకా ఈ కార్యక్రమంలో కేమెరా మాన్ రవి, ప్రముఖ నిర్మాత : అర్జున్ , Excutive ప్రొడ్యూసర్  :అనిల్ మైలాపూర్, లైన్ ప్రొడ్యూసర్ : కిరణ్ Ch తదితరులు పాల్గొన్నారు. శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాక‌జైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌, జైబోలో చంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ఃల‌క్ష్మీభూపాల‌, సంగీతంః శ్ర‌వ‌ణ్‌భ‌ర‌ద్వాజ్‌, కెమెరాఃర‌వి.వి, డాన్స్ఃఅజ‌య్‌సాయి, స్టంట్స్ఃరాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ఃఅనిల్ మైలాపుర్ , లైన్ ప్రొడ్యూసర్ : కిరణ్ Ch , ప్రొడ్యూస‌ ర్ః  ల‌క్ష్మ‌ణ్‌క్యాదారి, డైరెక్ట‌ర్ఃస‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌.